Samantha: ఏపీలో ఖరీదైన ఆస్తులు కొనేందుకు రెడీ?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేని కుటుంబం నుంచి హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సమంత గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ హీరో నాగచైతన్య సరసన హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో తన అమాయకమైన నటన, అందంతో సినీ అభిమానుల మనసులను దోచుకుంది.

ఈ సినిమాలో సమంత నటనను ఇష్టపడిన దర్శక నిర్మాతలు సైతం సమంతతో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపించారు. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను ఇచ్చారు. ఈ క్రమంలోనే సమంత కూడా వారు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా నిలిచింది. ఇక ఎన్నో సినిమాల్లో నటించి కొన్నేళ్లపాటు తన హవాను కొనసాగించింది. సమంత సినిమాలలో నటించి భారీగానే డబ్బులను సంపాదించుకుంది.

సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ లలోను నటించి డబ్బులను సంపాదించింది. ఇక పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ వంటి కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొని భారీగా రెమ్యూనరేషన్ వసూలు చేసేదట. ఇక సోషల్ మీడియాలోనూ సమంత ప్రమోషన్స్ చేస్తూ ఉంటుంది. అలా ఒక్కో ప్రమోషన్ కు సమంత కోట్లలో డబ్బులను తీసుకుంటుందని సమాచారం. ఇక సమంతకు ఆస్తులు భారీగానే ఉన్నాయి. భవనాలు, భూములు విపరీతంగా ఉన్నాయట. హైదరాబాద్, చెన్నై వంటి పలు నగరాల్లో విల్లాలు కూడా ఉన్నాయి.

- Advertisement -

ఇక సమంత ఏపీలో కూడా భారీగా భూములు కొనాలనే ప్లాన్ లో ఉందట. ఏకంగా అమరావతిలోనే ఫ్లాట్స్ కొనాలని ప్లాన్ చేస్తుందట. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అక్కడ రియల్ ఎస్టేట్ భారీగా పెరిగిందని…. అందుకే సమంత అక్కడ ఫ్లాట్స్ కొనాలని చూస్తుందట. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేని కుటుంబం నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు భారీగా డబ్బులను సంపాదించి కోటీశ్వరురాలు అయిందని కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు