Samantha: RCBపై సమంత షాకింగ్ పోస్ట్ !

Samantha: టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అద్భుతమైన నటన, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమా అవకాశాలను అందిపుచ్చుకొని స్టార్ హీరోయిన్గా ఎదిగింది. దాదాపు స్టార్ అగ్ర హీరోలు అందరి సరసన నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. సమంత టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది.

కేవలం సినిమాలోనే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుండడం విశేషం. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆమె పెట్టిన పోస్ట్ ఏంటంటే…. “ఐ వానా సి యూ విన్” అనే పోస్ట్ పెట్టి దాని కింద క్యాప్షన్ జత చేసింది.

ఈ పోస్ట్ సమంత ఎవరిని ఉద్దేశించి పెట్టిందో తెలియదు కానీ ఈరోజు మోడీ స్టేడియంలో రాత్రి రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ ఉందన్న సంగతి తెలిసిందే. దీంతో సమంత బెంగుళూరు జట్టును ఉద్దేశించి ఆ పోస్ట్ పెట్టిందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఎప్పటిలాగే ఈ సాల కప్ నమ్దే అంటూ సమంత పెట్టిన పోస్ట్ కింద పెద్ద ఎత్తున కామెంట్లు కనిపిస్తున్నాయి.

- Advertisement -

నిజానికి ఈసారి ఐపీఎల్ సీజన్లో ఎవ్వరూ ఊహించని విధంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆప్స్ కి చేరుకొని అందరికీ షాక్ ఇచ్చింది.దీంతో సమంత ఆర్సీబీకి సపోర్ట్ చేస్తుందేమోనని ఆమె అభిమానులు భావిస్తున్నారు. ఇక మరికొందరేమో ఆమె పెట్టిన పోస్ట్ కి, క్రికెట్ కి సంబంధం లేదంటూ….ఆమె ఏదో తన పర్సనల్ లైఫ్ గురించి పోస్ట్ పెట్టినట్టు ఉందని కామెంట్లు చేస్తున్నారు.

https://www.instagram.com/p/C7QWd-5yutF/?utm_source=ig_web_button_share_sheet

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు