Samantha : విసువల్ ఎఫక్ట్స్ తో అక్కటుకుంటున్న శాకుంతలం

సమంత రూత్ ప్రభు లీడ్ రోల్ లో నటించిన చిత్రం “శాకుంతలం”. ఈ చిత్రానికి పిరియాడికల్ సినిమాలకు పెట్టింది పేరు అని అనిపించుకున్న గుణ శేఖర్ దర్శకత్వం వహించారు. దిల్ రాజ్ సమర్పిస్తుండగా.. గుణ క్రియేషన్స్ బ్యానర్ పై నీలిమా గుణ నిర్మిస్తున్నారు. శాకుంతలం సినిమాను కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలము అనే ప్రేమ కావ్యం ఆధారంగా తీసుకుని గుణ శేఖర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం మహాభారతంలోని శకుంతల, దుష్యంత రాజు ల అద్భుతమైన ప్రేమకథ చుట్టూ తిరుగుతుంది.

అయితే తాజాగా శాకుంతలం థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ విడుదుల చేశారు. ట్రైలర్ ను చూస్తే ఎవరైనా.. విజువల్స్ గురించి మాట్లాడుకోవాల్సిందే. ట్రైలర్ లో వచ్చిన VFX అందరిని మంత్ర ముగ్దుల్ని చేస్తున్నాయి. విజువల్స్ తో సినిమా హిట్ అందుకునేలా ఉంది. ఈ ట్రైలర్‌లో అల్లు అర్హ, గౌతమి, అనన్య నాగళ్ల, జిష్షు సేన్‌గుప్తా తో పాటు మంచు మోహన్ బాబు ముఖ్య పాత్రలు చేశారు.

దుశ్యంత రాజు పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటున ఆకట్టుకుంటుంది. అలాగే ట్రైలర్ మొత్తం సమంత మార్క్ నటన కనిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలో ఎమోషనల్ సీన్స్ ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా యశోద తర్వాత శాకుంతలం కూడా సామ్ కు మంచి హిట్ ఇచ్చేలా ఉంది.

- Advertisement -

అయితే ఈ సినిమా విడుదల తేదీ నవంబర్ 4, 2022న కావాల్సి ఉండగా కానీ కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. కాగా ఈ అద్భుత ప్రేమ కావ్యం రిలీజ్ డేట్ ను ఫిబ్రవరి 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

https://filmify.in/video-gallery/shaakuntalam-telugu-trailer-22801.html

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు