Samantha : మెగా స్టార్ మూవీ నుంచి సామ్ తప్పుకుందా? తప్పించారా?

Samantha : సౌత్ క్వీన్ సమంత చాలా కాలంగా మయోసైటిస్ కారణంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవల వ్యాధి నుంచి కోలుకున్న ఆవిడ ఓవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు సినిమాలపై దృష్టి పెడుతోంది. కానీ అంతలోనే వివాదాల్లో చిక్కుకుంది. అయితే ఇప్పటికే ఆమె ఒప్పుకున్న మెగాస్టార్ మూవీ నుంచి సమంత తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.

తప్పకుందా ? తప్పించారా ?

మయాసైటిస్ కోసం చికిత్స తీసుకోవడానికి దాదాపు ఏడాది పాటు బ్రేక్ తీసుకున్న సమంత చేతిలో ప్రస్తుతం పెద్దగా సినిమాలు ఏమీ లేవు. రీసెంట్ గా తన పుట్టినరోజు సందర్భంగా మా ఇంటి బంగారం అనే సినిమాను ప్రకటించింది. ఈ సినిమాతోనే ఆమె నిర్మాతగా కూడా మారబోతోంది. అలాగే సిటాడెల్ ఇండియన్ వెబ్ సిరీస్ లో భాగం కాబోతోంది. అయితే ఇది ఆమె బ్రేక్ తీసుకోవడానికంటే ముందే అంగీకరించిన వెబ్ సిరీస్. ఇక రీసెంట్ టైమ్స్ లో ఆమె ఒక సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఆ సినిమాలో, ఈ సినిమాలో నటిస్తోంది అని పుకార్లు రావడం తప్ప ఫుల్ క్లారిటీ అయితే లేదు. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలం నుంచి సమంత మెగాస్టార్ సినిమాలో హీరోయిన్ కాబోతోంది అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Mammootty, Samantha share screen for an ad campaign, video goes viral, mammootty samantha advertisement, movies, mollywood, malayalam cinema, samantha prabhu

- Advertisement -

అయితే తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగగా, అందులో సమంత కనిపించకపోవడం కొత్త అనుమానాలకు దారితీసింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా, తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రొడక్షన్ నెంబర్ 6 గా రాబోతున్న ఈ సినిమా ఓపెనింగ్ బుధవారమే ఘనంగా జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు స్టార్ట్ కాగా, మమ్ముట్టి సొంత నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో కథానాయికగా సమంత నటిస్తోందని, ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మేకర్స్ ని కలిసిందని ప్రచారం జరిగింది. కానీ ఇంతదాకా దీని గురించి చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. పూజా కార్యక్రమాల్లో సమంతా ఎక్కడ కనిపించలేదు. కనీసం సినిమా ఓపెనింగ్ విషయాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. దీంతో సమంత ఈ సినిమా నుంచి తప్పుకుందా అని ఆమె అభిమానులు డౌట్ పడుతుంటే, మరి కొంతమంది మాత్రం తాజాగా రైజ్ అయిన హెల్త్ టిప్ వివాదం వల్ల ఆమెను తప్పించారేమోనని కామెంట్స్ చేస్తున్నారు.

హ్యాట్రిక్ కాంబో మిస్ అయినట్టేనా?

తమిళ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇంతకుముందు సమంతతో కలిసి ఏ మాయ చేసావే, ఎటో వెళ్లిపోయింది మనసు వంటి సినిమాలను తీశారు. ఈ రెండు సినిమాలు కూడా మంచి కల్ట్ క్లాసిక్ హిట్స్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే మమ్ముట్టి సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తే, గౌతమ్ మీనన్-సమంత కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అవుతుందని ఆమె అభిమానులు సంబరపడ్డారు. అంతలోనే ఆమె సినిమా నుంచి తప్పుకుందనే టాక్ నడుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు