Samantha: హేమా కమిటీపై సమంతా రియాక్షన్.. ఇప్పటికీ పోరాటం అంటూ..?

Samantha: సినీ ఇండస్ట్రీ అంటే చాలామంది కేవలం రంగుల ప్రపంచమని అనుకుంటూ ఉంటారు. కానీ ఇందులో కూడా రాక్షస చర్యలు జరుగుతూ ఉంటాయనే విషయం చాలామంది తెలియకపోవచ్చు. కొంతమంది ఎన్నో సందర్భాలలో తెలియచేసినా.. చాలామంది పట్టించుకోరు. ఇటీవలే మలయాళ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ దుమారం అన్ని ఇండస్ట్రీలకు ఒక హెచ్చరికగా మారింది. హేమా కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో చాలామంది బాగోతాలు బయట పడ్డాయి..దీంతో ఒక్కొక్కరుగా తమకు ఎదురైనటువంటి కొన్ని చేదు అనుభవాలను కూడా తెలియజేస్తున్నారు. చాలామంది సెలబ్రిటీలు కూడా హేమ కమిటీకి సంబంధించి పలు విషయాలు తెలిపారు. తాజాగా సమంత కూడా ఈ విషయం పైన స్పందించినట్టు తెలుస్తోంది.

Samantha: Samantha's reaction on the Hema committee.. is it still a struggle..?
Samantha: Samantha’s reaction on the Hema committee.. is it still a struggle..?

హేమా కమిటీపై సమంత ప్రశంసలు..

సమంత ఈ విషయం పైన మాట్లాడుతూ.. హేమా కమిటీ పనితీరుపైన ఆమె ప్రశంసలు కురిపించింది. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టిక్ (WCC) వల్లే ఇది జరిగింది. చిత్ర పరిశ్రమలో మహిళలకు ఇలాంటి లైంగిక వేధింపులు జరగకుండా ఉండడం కోసమే WCC అవిశ్రాంతిగా కృషి చేసిందని , ఆ సంస్థ పైన ప్రశంసలు కురిపించింది సమంత. ఈ WCC అద్భుతమైన పనితీరును తను చాలా సంవత్సరాలుగా గమనిస్తూ ఉన్నానని.. వీటి వల్లే హేమ కమిటీ కూడా ఒక నివేదిక ఇచ్చింది అని తెలిపింది. సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, చిక్కులు వీటి వల్లే వెలుగులోకి వచ్చాయని తెలియజేసింది.

కనీస అవసరాల కోసం ఇప్పటికీ పోరాడుతున్నారు..

సినిమా షూటింగ్ లలో మహిళల కు గౌరవం ఇవ్వడం లేదు. అంతేకాదు వారి కనీస అవసరాల కోసం కూడా ఇప్పటికి ఎంతోమంది పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ వారి ప్రయత్నాలు ఇంకా ఇప్పటికి ఫలించడం లేదు ఇకనైనా రాబోయే రోజుల్లో అందుకు తగ్గ నిర్ణయాలు తీసుకుంటారని నమ్ముతున్నాను అంటూ సమంత తెలియజేస్తోంది. ఈ WCC లో వున్న తన స్నేహితులకు, సోదరీమణులకు కృతజ్ఞతలు అంటూ సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక విషయాన్ని తెలియజేసింది. మలయాళ సినీ ఇండస్ట్రీలో హేమా కమిటీ వల్ల విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

- Advertisement -

మాలీవుడ్ లో ఆరోపణలు.. మోహన్ లాల్ రాజీనామా..

ముఖ్యంగా చాలామంది సీనియర్ యాక్టర్ ల పైన పలు రకాల ఆరోపణలు తెలియజేయడం జరిగింది. దీంతో AMMA సభ్యుల పైన కూడా పలు రకాల ఆరోపణలు రావడంతో మోహన్లాల్ కూడా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఆయనతో పాటుగా అందులో ఉండే 17 మంది కూడా తమ పదవుల నుంచి తప్పుకోవడం జరిగింది.

సమంత సినిమాలు..

ఇక సమంత విషయానికి వస్తే.. తన భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత తన ఫోకస్ మొత్తం సినిమాల పైన పెట్టింది. ఒకవైపు తాను అనుభవిస్తున్న మయోసైటీస్ వ్యాధితో పోరాడుతూనే మరొకవైపు సినిమా ఎంపికలు విషయంలో జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళుతుంది. అందులో భాగంగానే వరుణ్ ధావన్ తో ఈమె కలిసిన నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. దీనికి తోడు నిర్మాతగా మారి మా ఇంటి బంగారం అనే సినిమాను నిర్మిస్తోంది సమంత. మరి అటు హీరోయిన్గా ఇటు నిర్మాతగా ఎటువంటి సక్సెస్ అందుకుంటున్న చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు