Samantha: ఆ హీరోయిన్ తో చైతూ క్లోజ్… సమంత సీరియస్?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి హీరోయిన్లలో సమంత ఒకరు. హీరోయిన్ సమంత గురించి తెలియని వారు ఉండరు. దాదాపు 13 నుంచి 14 సంవత్సరాల కెరీర్ సమంత సొంతం. 14 సంవత్సరాల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీని సమంత ఏలుతుందని స్పష్టంగా చెప్పవచ్చు. తన కెరీర్ ప్రారంభంలో తమిళ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేసిన సమంత… ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం మాయ చేసావే సినిమాతో బంపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ…. ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు. అయితే ఏం మాయ చేసావే సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా చేసిన సంగతి మనకు గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన సమంత నటించి అందరిని మెప్పించింది. ఈ సినిమా ఆల్ టైం రికార్డును కూడా సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నాగచైతన్య మరియు సమంత ఇద్దరు ప్రేమలో పడ్డారు.

అంతకుముందు… హీరో సిద్ధార్థ తో సమంత ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసినప్పటికీ… నాగచైతన్య ఆమెనే ప్రేమించేశాడు. దాదాపు ఏడు సంవత్సరాల పాటు నాగచైతన్య మరియు సమంత ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దల సమక్షంలో నాగచైతన్య, సమంత వివాహం జరిగింది. వీరిద్దరి వివాహం 2017 సంవత్సరంలో జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల 2021 సంవత్సరంలో నాగచైతన్య అలాగే సమంత ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇప్పటివరకు అసలు ఎందుకు విడాకులు తీసుకున్నారు మాత్రం చెప్పలేదు ఈ జంట.

- Advertisement -

విడాకులు తీసుకున్న తర్వాత హీరోయిన్ సమంత పై అక్కినేని ఫ్యాన్స్ అలాగే తెలుగు అభిమానులు దారుణంగా ట్రోలింగ్ చేశారు. వేరే హీరోతో సమంత ఎఫైర్ పెట్టుకుందని…. అందుకే నాగచైతన్యను వదిలిపెట్టిందని ఫైర్ అయ్యారు. అయితే… ఆ బాధలన్నీ అనుభవించిన సమంత… తన కెరీర్ తానే చూసుకుంటుంది. ఈ మధ్యకాలంలో మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధితో కూడా సమంత ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా తాజాగా నాగచైతన్య అలాగే సాయి పల్లవికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల సాయి పల్లవి బర్త్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సాయి పల్లవికి ఎంతో ప్రేమగా నాగచైతన్య కేక్ పెట్టాడు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో నేటిజన్స్ పెట్టి సమంతను ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫోటో సమంత చూస్తే కుళ్ళుకుంటుందని.. సీరియస్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు