Samantha: ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.. సామ్ భావోద్వేగం..!

Samantha: ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె అనంత కాలంలోనే తెలుగులో ఉండే స్టార్ హీరోల అందరితో కూడా దాదాపుగా నటించి మంచి పేరు సొంతం చేసుకుంది.. అయితే హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలి.. ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈమె విడాకుల తర్వాత వ్యక్తిగతంగా అన్నే ఇబ్బందులు ఎదుర్కొంది.. ఇకపోతే సినిమాల సంగతి పక్కన పెడితే ఈమె ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో గత కొంతకాలంగా పోరాడుతూనే ఉంది. వ్యాధి చికిత్స కోసం ఎన్నెన్నో చేస్తోంది కానీ ఆ వ్యాధి నుంచి బయటపడలేకపోతోంది సమంత. అందుకే సినిమాల నుంచి కూడా విరామం తీసుకుని మరీ ట్రీట్మెంట్ చేయించుకుంటుంది.. అంతే కాదు ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో.. ఈమె ఫోటోలు చూసి అభిమానులు సైతం కంటపడి పెట్టుకున్నారు. చాలా కాలం సైడ్ ఎఫెక్ట్స్ తో కూడా బాధపడిన ఈమె గత కొంతకాలంగా మళ్లీ సినిమాల్లోకి వచ్చేసింది.

వ్యాధితో బాధపడుతున్నా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం..

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఖుషి సినిమాతో ప్రేక్షకులను చివరిగా అలరించిన ఈమె.. సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలోనే బాలీవుడ్లో ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ నేపథ్యంలోనే అందరూ సమంత ఆరోగ్యం గురించే మాట్లాడుకుంటున్నారు.. సమంత వ్యాధి నయమయ్యింది.. త్వరలోనే ఇండస్ట్రీలోకి రాబోతోంది.. అని ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు.. అయితే ఇంతలోనే సమంత చేసిన ఒక పోస్ట్ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. సమంత చేసిన పోస్ట్ చూస్తే.. ఆమె ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉందని.. సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడడం కోసం అధునాతన వైద్య విధానాలను కూడా అనుసరిస్తోందని తెలుస్తోంది.. ముఖ్యంగా మయోసైటిస్ నుంచి బయటపడడానికి బోలెడు మెడిసిన్స్ తీసుకోవాల్సి వస్తోందట.. ఆ మందుల వల్ల తన ఆరోగ్యం మరింత దెబ్బతింటోందని.. ముఖ్యంగా అందం కూడా పోతోంది కాబట్టే సమంత ఈ విధానాలను పాటిస్తోందని సమాచారం.

ఆరోగ్యం కోసం కొత్త పద్ధతులు..

Samantha: Still haunting.. Sam's emotions..!
Samantha: Still haunting.. Sam’s emotions..!

వ్యాధినయం కోసమే కాదు అందంగా కనిపించడానికి కూడా క్రియో థెరపీ, ఇన్ఫ్రా రెడ్ సానా, ఐస్ బాత్ టబ్, న్యూరా నెర్డ్, ఎల్ఈడి లైట్ థెరపీ వంటి చికిత్స విధానాలను కూడా పాటిస్తోందట.. అయితే సమంత ఆరోగ్యం పూర్తిగా బాగుపడింది.. మళ్ళీ ఆమెను వరుసగా సినిమాల్లో చూడొచ్చు అని అనుకున్న అభిమానులకు.. ఈ విషయం మరింత నిరాశను కలిగిస్తోందనే చెప్పాలి.. తాజాగా సమంత చేసిన పోస్ట్ అభిమానులను ఆందోళనలకు గురిచేస్తోంది.. సమంత పూర్తిగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా ద్వారా కూడా కామెంట్లు చేస్తున్నారు..

- Advertisement -

నిర్మాతగా మారిన సమంత..

ఇకపోతే సమస్యల నుంచి బయటపడలేకపోతున్న ఈ ముద్దుగుమ్మ.. ఒకవైపు సినిమాలను ప్రకటిస్తోంది.. మరి ఎలా సినిమాలలో నటిస్తోంది అంటూ అభిమానులు.. ఆందోళనతో పాటూ అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.. ఇకపోతే ఈమె సొంతంగా ట్రా లాలా మూవింగ్ పిక్చర్స్ అనే ఒక నిర్మాణ సంస్థని కూడా స్థాపించారు.. తన సొంత నిర్మాణ బ్యానర్ లో ఇప్పుడు మా ఇంటి బంగారం అనే సినిమాని కూడా తీస్తోంది సమంత. అలాగే మరొకవైపు ఎన్టీఆర్ నటించబోయే ఒక ప్రాజెక్టులో కూడా భాగం కాబోతున్నట్లు సమాచారం.. ఇకపోతే సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న ఈ ముద్దుగుమ్మ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు