Samantha: సమంత ఇంకా కోలుకోలేదా ?

Samantha health update : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఆ సినిమా అనంతరం వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగింది. సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ నాలుగేళ్లు కలిసి జీవించారు. ఇక ఏమైందో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

Samantha Latest photoshoots viral on social media

విడాకులు అనంతరం సమంత మయోసైటిస్ వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. ఈ చికిత్సకు సమంతా చాలా రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తోంది. వ్యాయామాలు కూడా చేస్తోంది. కొన్నిరోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చి అమెరికాకి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకొని పూర్తిగా కోలుకుంది. ట్రీట్మెంట్ అనంతరం సమంత మళ్ళీ సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉంది.

- Advertisement -

ట్రీట్మెంట్ అనంతరం సమంత ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీపైనే ఆసక్తి చూపించింది. ఇక ఏమైందో తెలియదు ఈ మధ్య మళ్లీ సినిమాలు ఒప్పుకోవడం లేదట. ఎందుకు సినిమాల్లో నటించడం లేదని ఆరా తీయగా….ఇంకా మయోసైటిస్ వ్యాధి నుంచి ఇంకా కోలుకోలేదని ….మళ్లీ అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకోవాలని అనుకుంటుందట. ఈ కారణంగానే సమంత సినిమాలో నటించడానికి ఒప్పుకోవడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. ఇక సమంత అభిమానులు అతి తొందరలోనే సమంత కోలుకొని మళ్ళీ సినిమాల్లో నటించాలని ప్రార్థిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు