Samantha: విషాదాన్ని మాటల్లో చెప్పలేం..ఇజ్రాయిల్ దాడులపై సమంత ఆవేదన..!

Samantha: గత కొన్ని నెలలుగా ఇజ్రాయిల్ – హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది . హమాస్ ను నామరూపాలు లేకుండా అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయిల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి.. ఇక్కడి దాడులు చూసే వారిని ఆవేదనకు గురిచేస్తున్నాయి.. గాజా తర్వాత ప్రస్తుతం ఇజ్రాయిల్ సైన్యం రఫా నగరంలో పెద్ద ఎత్తున దాడులు చేస్తూ.. అక్కడివారిని నాశనం చేస్తోంది. ఇజ్రాయిల్ దళాలు ఆదివారం రఫా లోని శరణార్థి శిబిరాలపై పెద్ద ఎత్తున దాడులు చేయగా.. ఆ దాడుల్లో ఏకంగా 45 మంది ప్రజలు మరణించారు.. అంతేకాకుండా పెద్ద ఎత్తున ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు కూడా.. అయితే ఈ దాడుల్లో మృతుల సంఖ్య ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తాజా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇజ్రాయిల్ దేశం పై ప్రపంచ దేశాలు ఆగ్రహం.

Samantha: Tragedy cannot be expressed in words.. Samantha's anguish over Israel's attacks..!
Samantha: Tragedy cannot be expressed in words.. Samantha’s anguish over Israel’s attacks..!

ఇక ఈ బాధలు తట్టుకోలేక అక్కడి ప్రజల ఆర్ధనాదాలకు సెలబ్రిటీలు సైతం చలించిపోతున్నారు. ఇదిలా ఉండగా రఫా నగరం పై దాడి ఒక విషాదకరమైన తప్పిదం అంటూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఒప్పుకున్నారు.. పాలస్తీనా లో నివసిస్తున్న శరణార్థ శిబిరం టెంట్ క్యాంపునకు నిప్పు పెట్టిన ఘటనలో కనీసం 45 మంది మరణించి ఉంటారు.. పాలస్తీనాపై ఇజ్రాయిల్ జరిపిన తాజా దాడిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.. ముఖ్యంగా సజీవ దహనమైన చిన్నారులతో సహా పౌరుల మరణాలపై కూడా పలువురు భారతీయ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.. ఈ క్రమంలోనే ఇండియన్ సెలబ్రిటీస్ కూడా ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్లు పెడుతున్నారు.

పాలస్తీనాలో దాడులపై సమంత ఆవేదన..

ఈ క్రమంలోని ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ తన ఇంస్టా స్టోరీలో ఈ విధంగా స్పందించింది..రఫాలో ఇజ్రాయిల్ దాడులను తక్షణమే నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం శుక్రవారం తీర్పు ఇచ్చింది.. ఆ తర్వాత కూడా రఫాపై మళ్ళీ దాడి జరిగింది.. ఈ బీభత్సాన్ని మాటల్లో వర్ణించలేము.. సురక్షితమైన ప్రాంతం అసలు ఎక్కడా లేదా..? ఈ యుద్ధం ఆగిపోవాలి అంటూ ఆమె తెలిపింది.. అంతేకాదు ఆమె తన ఇన్స్టా స్టోరీలో..పిల్లలపై బాంబు దాడిని ఏదీ సమర్థించదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.. పసిపిల్లలు ఏం చేస్తారు ..వారికంటూ ఒక రక్షణ లేదు.. వేదాంతం లేదు.. సరిహద్దు లేదు.. సైన్స్ లేదు.. నైతికత లేదు.. రాజకీయం లేదు.. చరిత్ర లేదు.. నాయకుడు లేడు.. అసలు ఏదీ కూడా ఇటువంటి చర్యను సమర్ధించదు.. ఒక పసిపాప తల తెగడం ఎంతవరకు న్యాయం.. ఈ సమాజంలో పసి పిల్లలకు కూడా రక్షణ లభించదా.. మా మధ్య ఒక తల తెగిన పాప శరీరం ఉండడం మమ్మల్ని మరింత తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది .. అసలు ఈ యుద్ధాన్ని ఆపే వారే లేరా అంటూ ఆగ్రహం తో పాటు ఆవేదన వ్యక్తం చేసింది సమంత..

- Advertisement -

ALL EYES ON RAFHA..

ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా ఇజ్రాయిల్ చేస్తున్న దాడులకు ప్రతి ఒక్క సెలబ్రిటీస్ స్పందిస్తూ తమదైన శైలిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇక ప్రస్తుతం ALL EYES ON RAFHA అనే ట్యాగ్ లైన్ తో టాలీవుడ్ , కోలీవుడ్, బాలీవుడ్, శాండిల్ వుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు ఈ విషయంపై స్పందిస్తూ పాలస్తీనాలో ప్రజలకు సంఘీభావం తెలుపుతూ.. దాడులు వెంటనే ఆపాలని పోస్ట్ లు పెడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు