Samantha: యశోద పరిస్థితేంటి ?

టాలీవుడ్ క్వీన్ సమంత ఈ మధ్య కాలంలో ఫుల్ జోష్ లో ఉంది. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, బిజీ బిజీగా గడుపుతుంది. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. హార్రర్, కామెడీ, రొమాన్స్, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ ఏదైనా సై అంటుంది. ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే, మరోపక్క కమర్షియల్, లవ్ స్టోరీస్ లోనూ నటిస్తోంది.

సమంత ‘శాకుంతలం’, ‘యశోద’ అనే లేడీ ఓరియెంటెండ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో యశోద సినిమాను హరి, హరీష్ అనే దర్శకులు తెరకెక్కించారు. విమెన్ సెంట్రిక్ సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని మేకర్స్ ఇప్పటికే అధికారిక ప్రకటన చేశారు.

అయితే, ఆగస్టులో అదే సమయానికి చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. పోటీ ఎక్కువ ఉండటంతో సమంత సినిమా వాయిదా పడుతుందని ప్రచారం సాగింది. కానీ దాని గురించి అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు. చెప్పిన డేట్ కి రిలీజ్ చేస్తారు అనుకుంటే అసలు ప్రొమోషన్స్ కూడా మొదలుపెట్టలేదు. ఒక మంచి సినిమాను చేయడం ఎంత ముఖ్యమో ఆ సినిమాను ప్రేక్షకులకు చేర్చడం కూడా అంతే ముఖ్యం. ఏదిఏమైనా యశోద సినిమా పరిస్థితి ఏంటి అనేది అంతుచిక్కడం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు