Naga Chaitanya: రూమర్ న్యూస్ పై సమంత ఫైర్..

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత కి సోసైటీ నుంచి వస్తున్న కష్టాలు రోజురోజుకి తన లో ఓపిక నశించేలా చేస్తున్నాయి. దేనికైనా ఓ హద్దు ఉంటుంది. సమంత మంచితనాన్ని అలుసుగా తీసుకొని ఇష్టమైన వార్తలను కొంత మంది రాస్తున్నారు. వీటిని సామ్ అస్సల్ పట్టించుకోదు. కానీ, తాజాగా తన గురించి ఓ రూమర్ ను రాసిన ఒక ప్రముఖ వెబ్ సైట్ కి తన స్టైల్ లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీనికి సమంత అభిమానులు కూడా అండగా నిలుస్తున్నారు.

వివరాల్లోకి వెళితే నాగచైతన్య తో విడాకుల తర్వాత సమంత చాలా క్రుంగి పోయింది. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. తర్వాత స్నేహితుల సపోర్ట్ తో మళ్ళీ సినిమాలు చేస్తూ బిజీ అయింది. అప్పుడు కూడా సమంతని కష్టాలు వెంటాడాయి. ఇప్పుడిప్పుడే సామ్ ‘మాయోసైటిస్’ నుంచి కోలుకుని శాకుంతలం సినిమా ప్రమోషన్స్‌తో పాటు సిటాడెల్, ఖుషి షూటింగ్స్ లో పాల్గొంటుంది. అయితే ఇప్పుడు సమంత కి ఈ సోషల్ మీడియా కూడా నిద్ర పోనివ్వట్లేదు. తన దారిన తాను బ్రతుకుతుంటే పుండు మీద కారం చల్లినట్లు ఒక ప్రముఖ వెబ్ సైట్ సమంత పై నోరు పారేసుకుంది.

ఇక ఆ టాపిక్ లో మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా నాగ చైతన్య తో తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాల చనువుగా తిరుగుతోందని సోషల్ మీడియా ద్వారా తెలిసింది. వీళ్ళ ఆఫిషియల్ అకౌంట్స్ లో పిక్స్ పెట్టకపోయినా వీళ్ళ మధ్య ఎఫైర్ నడుస్తోందటూ విపరీతంగా వార్తలు చక్కర్లు కొట్టాయి.

- Advertisement -

వీరిద్దరూ ప్రేమించుకున్నట్లు, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీని పైన చైతన్య గాని అటు శోభిత గాని అసలు స్పందించలేదు. అయితే వీళ్ళెవరూ స్పందించక పోయినా వీళ్ళ ఎఫైర్ గురించి ఏకంగా సమంత స్పందించినట్టు కథ అల్లి రాసారు.

ఆ పోస్ట్ లో సమంత ఇలా స్పందించినట్టు రాసారు.
“ఎవరు ఎవరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నారో నాకు ఇబ్బంది లేదు”.
“ప్రేమకు విలువ ఇవ్వని వారు ఎంతమందితో కలిసినా కన్నీళ్లే మిగులుతాయి”.

“కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి”. అని సమంత ఓ ఇంటర్వ్యూ లో చెప్పినట్టు రాసారు.

ఈ విషయం లో సమంత చాలా సీరియస్ అయింది. సాధారణంగా సోషల్ మీడియా లో ఫొటోస్ పెట్టడం, మూవీస్ అప్ డేట్లు ఇవ్వడం తప్ప వేరే ఇష్యూల గురించి, రూమర్స్ గురించి స్పందించని సమంత ఒక్కసారిగా ఆ వెబ్ సైట్ పై కామెంట్ చేసింది. “తాను అలా ఎప్పుడు చెప్పలేదు” అని చిన్న మాటతో జవాబిచ్చింది. అయితే సమంత ఒక్క కామెంట్ తో బదులిచ్చినా, సమంత కి సపోర్ట్ గా ఆమె అభిమానులు మాత్రం సదరు వెబ్ సైట్ ని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

ట్విట్టర్ లో చేసిన ఆ కామెంట్ కింద రూమర్స్ స్ప్రెడ్ చేసిన వారిని బూతులు తిడుతున్నారు. అంతే కాదు నెటిజన్లు ఆ వెబ్ సైట్ ని బ్లాక్ చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు మాత్రం ఇలాంటి చెత్త న్యూస్ లకు దూరంగా ఉండాలని ప్రతి దానికి స్పందించాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఏది ఏమైనా సమంత వేసిన ఆ చిన్న ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు