Samantha: పవన్‌ కళ్యాణ్‌ దగ్గరకు సమంత..అంత ప్రమాదంలో ఉందా?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేని కుటుంబం నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకోంది. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా నిలిచింది. ఈ బ్యూటీ ఎక్కువగా స్టార్ హీరోల సరసన జతకట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సమంత నటనకి, అందానికి ఎంతోమంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే.

ఇక సమంత ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల్లో పెద్దగా నటించడం లేదు. ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తుంది. ఇక ఇదిలా ఉండగా సమంతకి పెట్స్, ప్రకృతి అన్నా చాలా ఇష్టం. అంతేకాకుండా సమంత చాలామంది అనాధ పిల్లల కోసం ఒక ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సమంతకి పెట్స్ అంటే చాలా ఇష్టం. తన దగ్గర చాలా రకాల పెట్స్ ఉన్నాయి. వాటిని చాలా సార్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. అంతేకాకుండా తాను తన ఇంట్లోనే చెట్లని పెంచుతూ, కూరగాయలను పెంచుతూ ఉంటుంది.

సమంత డైట్ చాలా బాగా ఫాలో అవుతుంది. హెల్త్ గురించి చాలా రకాల వ్యాయామాలు, ఎక్సర్సైజ్ లు చేస్తూ హెల్త్ పరంగా చాలా కఠినమైన డైట్ ఫాలో అవుతుంది. అందుకే నేచురల్ గా ఇంట్లోనే పండిస్తూ వాటిని తింటూ ఉంటుంది. ఇదిలా ఉండగా….సమంత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవాలని అనుకుంటుందట. అతనితో పర్సనల్ గా కొన్ని విషయాలు మాట్లాడాలని నిర్ణయం తీసుకుందట. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నుంచి తనకు సాయం కావాలని అడగడానికి వెళ్తుందని వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

తనకు ఎంతో ఇష్టమైన చెట్లను నరకకుండా కాపాడాలని…. ప్రజల్లో చెట్ల గురించి అవగాహన కల్పించాలని పవన్ కళ్యాణ్ సాయం తీసుకోబోతుందట. అంతేకాకుండా ఆరోగ్యం గురించి ప్రజలకు శ్రద్ధ, సరైన డైట్ ఫాలో అయ్యేలా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని అనుకుంటుందట. ఇక ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి చర్చించి తన సహాయం తీసుకోవాలని అనుకుంటుందట. ఇక త్వరలోనే వీరు కలవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు