Samantha : సమంత టెన్త్ క్లాస్ మార్క్ మెమో వైరల్.. సడెన్ గా ఇప్పుడెందుకు?

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha) గురించి ఎంత చెప్పినా తక్కువే.. అందం, అభినయంతో పాటుగా వరుస సక్సెస్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే గత రెండేళ్లుగా తెలుగులో సినిమాలు చెయ్యలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటివరకు తెలుగులో సినిమాను అనౌన్స్ చెయ్యకపోవడంతో ఆమె తెలుగు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా సమంత గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

గతంలో ఆరోగ్య పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సామ్.. అరుదైన వ్యాధి నుంచి కోలుకున్నాక ఆమె తెలుగులో ఒప్పుకున్న సినిమాలను బ్యాక్ టు బ్యాక్ చేసేసింది. అయితే అందులో ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. దాంతో తెలుగు సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది సామ్. అయితే సినిమాల విషయం పక్కన పెడితే.. సమంత సినిమాలనే కాదు. బిజినెస్ కూడా చేస్తూ బిజీగా ఉంది. స్కూల్, క్లాత్ బ్రాండ్, గేమ్స్.. ఇలా అన్నింటా పెట్టుబడులు పెట్టిన ఆమె సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఆమె టెన్త్ మార్క్ మెమో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆమె మార్కులను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Samantha's tenth class mark memo viral.. why suddenly
Samantha’s tenth class mark memo viral.. why suddenly

నిజానికి హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ కు సంబంధించిన రిపోర్ట్ కాగా.. ఇంగ్లీష్, తమిళ్ తోపాటు అన్ని సబ్జెక్టుల్లో 80 ప్లస్ , 90 ప్లస్ మార్క్స్ రాగా మ్యాథ్స్ లో మాత్రం 100కు 100 మార్కులు సంపాదించింది. 1000కి 887 మార్కులతో క్లాస్ ఫస్ట్ ర్యాంక్ కొట్టేసింది. ఇవి చూసిన ఫ్యాన్స్ మాత్రం పొగడకుండా ఉండలేరు. దీంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజులో వైరల్ అవుతుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సమంత ఈ మధ్య తెలుగులో సినిమాలు ( Telugu Movies), ఐటమ్ సాంగ్స్ (Item songs) చెయ్యలేదు. బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లను మాత్రం చేస్తూ బిజీగా ఉంది. అంతేకాదు ముంబైలోనే కొత్త ఇల్లు కూడా కొనేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు