NagaChaithanya : సమంతతో విడిపోయిన రోజే శోభితతో నిశ్చితార్థం ..

NagaChaithanya : అక్కినేని నాగ చైతన్య గురించి టాలీవుడ్ ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అక్కినేని నాగార్జున వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఒక్కో సినిమాలో తన టాలెంట్ తో అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు. ఇక ఈయన హీరోయిన్ సమంతతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి కేవలం మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలింది. మనస్పర్థలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. 29 జ‌న‌వ‌రి 2017న ఆమెని పెళ్లి చేసుకున్నారు. అట్ట‌హాసంగా వారిద్ద‌రి పెళ్లి జ‌రిగింది. ఇక కొన్నాళ్ల పాటు వారి సంసార జీవితం స‌జావుగానే సాగింది. నాలుగేళ్ల తర్వాత విడిపోయినట్లు ప్రకటించారు. వీరిద్దరూ మళ్లీ కలవాలని చాలా మంది కోరుకున్నారు. కానీ అలా జరగలేదు..

అయితే స‌మంత నుండి విడిపోయిన త‌ర్వాత నాగ చైతన్య .. శోభిత‌తో ప్రేమ‌లో ఉన్నాడ‌ని త్వ‌ర‌లో వారిద్దరి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని జోరుగా ప్ర‌చారం న‌డుస్తుంది.. గత ఏడాది వీరిద్దరూ వెకేషన్ కు వెళ్లడం అక్కడ దిగిన ఫోటోలను పోస్ట్ చెయ్యడం తో ఇద్దరు రిలేషన్ లో ఉన్నట్లు దొరికారు. అప్పటి నుంచి ఇద్దరు వేకెషన్స్ లో ఎంజాయ్ చేస్తూ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. వీరిద్దరి గురించి గత కొంత కాలంగా వస్తున్న రూమర్స్ నిజమయ్యాయి. వీళ్ళిద్దరూ ఘాడమైన ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున గత కొన్ని నెలలుగా ప్రచారం జరిగింది.. అలా సైలెంట్ గానే ఉంటూ ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం..

day he broke up with Samantha, he got engaged to Shobhita.
same day he broke up with Samantha, he got engaged to Shobhita.

వీరిద్దరూ రిలేషన్లో ఉన్నట్లు వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు. తమ రిలేషన్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ ఉదయం 9 గంటల 42 నిమిషాలకు నాగార్జున, శోభిత ధూళిపాలకి నిశ్చితార్థం జరిగినట్లు నాగార్జున స్వయంగా సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా కొత్త జంటని ఆశీర్వదించిన ఫొటోస్ ని నాగార్జున అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు జనాలకు కొత్త డౌట్లు వస్తున్నాయి. ఈరోజు నాగ చైతన్య, సమంత విడిపోయిన రోజు అని చాలా మందికి తెలియదు. వీరిద్దరూ దూరం అయ్యింది ఈరోజే. కానీ అక్టోబర్ 2 అఫిషియల్ గా ప్రకటించారు. గతంలో జరిగిన విధంగా రెండో పెళ్లి కూడా చెడి పోకుండా ఉండాలని జాతకాలకు మ్యాచ్ అయ్యేల వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగిందట.

- Advertisement -

గతంలో ఈరోజున సమంత తో విడిపోయాడు. కానీ ఇదే రోజున శోభితతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ డేట్ మిస్ అవ్వకుండా చైతూ పక్కా ప్లాన్ చేసి మరి చేసుకున్నట్లు వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇక ఇద్దరి కుటుంబాల్లో వీరి పెళ్లి గురించి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. డిసెంబర్ లో పెళ్లి ఉంటుందని వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఏది ఏమైనా వీరిద్దరూ హ్యాపీగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక నాగ చైతన్య, శోభిత ఇద్దరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు