Sameera Reddy: ఆ పార్ట్ సర్జరీ చేయించుకోమని నాకు చాలా మంది సలహా ఇచ్చారు

Sameera Reddy: సమీరా రెడ్డి ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయకపోయినా కూడా చేసిన కొన్ని సినిమాలు తో మంచి గుర్తింపును సాధించుకుంది. ముఖ్యంగా తమిళ్లో వచ్చిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా తెలుగులో అదే పేరుతో డబ్బింగ్ అయింది. ఆ సినిమాలో మేఘన అనే పాత్రలో కనిపించింది సమీరా రెడ్డి. ఆ పాత్ర సమీరా రెడ్డి కెరియర్లో కీలకమని చెప్పొచ్చు. అంత అద్భుతంగా ఆ సినిమాలో గౌతమ్ వాసుదేవ మీనన్ సమీరారెడ్డిని చూపించాడు. సమీరా రెడ్డి కి అక్కడితో చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు.

Sameera Reddy

 

- Advertisement -

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలామంది కలలు కంటారు. కానీ ఆ కలలు అందరికీ నిజం కావు. కానీ సమీరా రెడ్డికి మాత్రం అవకాశం దక్కింది. విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన జై చిరంజీవ సినిమాలో చిరంజీవి సరసన నటించింది. త్రివిక్రమ్ రాసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఇప్పటికే ఈ సినిమాకి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి టైమింగ్ ఈ సినిమాలో అదిరిపోతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన అశోక్ అనే సినిమాలో కూడా కనిపించింది సమీరా.

ఇక ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమీరారెడ్డి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను పెడుతూ ఉంటుంది. రీసెంట్ గా ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది సమీరా రెడ్డి. ‘నా కెరీర్ అగ్రస్థానంలో ఉన్న రోజుల్లో నాపై ఒత్తిడి చాలా ఉండేది. చాలామంది బూబ్ జాబ్ సర్జరీ(బ్రెస్ట్ ఇంప్లాంటేషన్) చేయించుకోమని సలహా ఇచ్చారు. అందరు చేయించుకుంటున్నారు కదా.. మీకేమైందంటూ అడిగేవారు. సర్జరీ చేసుకోమని నాపై ఒత్తిడి తెచ్చారు. కానీ నాకు అది ఇష్టం లేదు. మన జీవితం ఎలా ఉంటుందో తెలియదు. నేను ప్లాస్టిక్ సర్జరీ, బొటాక్స్ చేయించుకునే వారిని తప్పుపట్టను. ఎందుకంటే నా విషయంలో సమస్యను నేను పరిష్కరించుకోగలను’ అని చెప్పింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు