Sampath Nandi: హ్యాట్రిక్ కాంబినేషన్

టాలీవుడ్ హీరో గోపీచంద్ ఇటీవల పక్కా కమర్షయల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను బన్ని వాస్ నిర్మించారు. జులై 1వ తేదీన భారీ అంచనాల నడుమ ఈ సినిమా థియేటర్ లలో రిలీజ్ అయింది. కానీ కమర్షియల్ గా హిట్ కొట్టలేకపోయింది. దీంతో హీరో గోపీచంద్ కు మరోసారి నిరాశే దక్కింది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ తప్పకుండా హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం గోపీచంద్ తర్వాత సినిమా సెట్ అయిందట. గోపీచంద్ ను గౌతమ్ నందా, సీటీమార్ సినిమాలతో డైరెక్ట్ చేసిన సంపత్ నంది, గోపీచంద్ కు తాజాగా మరో కథ చెప్పాడట. కథ నచ్చడంతో సంపత్ నందితో సినిమా చేయడానికి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అయితే సంపత్ నంది గురించి మరి కొన్ని వార్తలు వినిపించాయి. నందమూరి కళ్యాణ్ రామ్, రవితేజ లతో సినిమాలు చేయాలని సంపత్ ప్రయత్నించాడట. ఇప్పుడు గోపీచంద్ తో అని వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే సంపత్ నంది తర్వాత సినిమా ప్రకటించేంత వరక ఎదురుచూడాల్సిందే. ఒకవేళ గోపీచంద్ తో సినిమా ఫిక్స్ అయితే అది హ్యాట్రిక్ కాంబినేషన్ అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు