Samyuktha Menon: సంయుక్త ను అంతలా టార్చర్ చేస్తున్న ఆ నిర్మాత ?

Samyuktha Menon: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారన్న సంగతి తెలిసిందే. అయితే మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ల కంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎక్కువ. దర్శకనిర్మాతలకు కూడా వారికి ఎక్కువగా ఛాన్సులు ఇస్తారు. దీని అంతటికి కారణం… ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్ ఎక్స్పోజింగ్ బాగా చేస్తారు. ఇది అంశాన్ని పట్టుకున్న టాలీవుడ్ దర్శక నిర్మాతలు పక్క రాష్ట్రాల వారిపై ఆధారపడుతున్నారు. అయితే మన తెలుగు హీరోయిన్లు ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేయడానికి ఆసక్తి చూపించరు.. అందుకే… ఈ పరిస్థితి నెలకొంది మన టాలీవుడ్ ఇండస్ట్రీలో..!

అయితే పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్ల కొంతమంది సక్సెస్ అవుతే… మరి కొంతమంది అట్టర్ ప్లాప్ అవుతున్నారు. అలాంటివారిలో చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది ఒక్క సినిమాతోనే బాగా పాపులర్ అవుతారు. అలాంటి హీరోయిన్లలో సంయుక్త మీనన్ ఒకరు. టాలీవుడ్‌ హీరోయిన్‌ సంయుక్త మీనన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించాలని చూస్తున్న వారిలో సంయుక్త మీనన్ కూడా ఒకరు. Samyuktha Menon

మన టాలీవుడ్ లో మొదట భీమ్లా నాయక్ సినిమాలో రానా భార్యగా నటించి….తన నటనతో అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. ఆ తర్వాత ధనుష్ తో కలిసి సార్ సినిమాలో కూడా నటించి మంచి క్రేజ్ అందుకుంది సంయుక్త మీనన్. ఆ వెంటనే కళ్యాణ్ రామ్ తో బింబిసారా సినిమా, సాయిధరమ్ తేజ్ తో విరూపాక్ష సినిమాలలో నటించి వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది సంయుక్త మీనన్. ఇప్పటికే ఈమె నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈమె పేరు ఇండస్ట్రీలో చాలా గట్టిగా వినిపిస్తోంది.

- Advertisement -

అయితే చాలామంది సంయుక్తను హీరోయిన్ గా పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టాలీవుడ్‌ దర్శక, నిర్మాతలు కూడా సంయుక్త మీనన్ ఎక్కువగా చాన్సులు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఇది ఇలా ఉండగా, సంయుక్త మీనన్ గురించి ఓ సంచలన విషయం వైరల్ గా మారింది. తన కెరీర్‌ ప్రారంభంలో ఓ అనూహ్యమైన సంఘటనను ఎదుర్కొందట టాలీవుడ్‌ హీరోయిన్‌ సంయుక్త మీనన్. తమిళ ఇండస్ట్రీలో ఉన్న ఓ నిర్మాత…తనతో గడపాలని టాలీవుడ్‌ హీరోయిన్‌ సంయుక్త మీనన్ ను టార్చర్‌ చేశాడట. అయితే.. దానికి సంయుక్త అస్సలు ఒప్పుకోలేదట. తన సొంత టాలెంట్‌ తోనే ఎదిగింది టాలీవుడ్‌ హీరోయిన్‌ సంయుక్త మీనన్. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు