Virupaksha: మళ్ళీ సత్తా చాటిన గోల్డెన్ లెగ్ హీరోయిన్..!

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన సినిమా విరూపాక్ష. ఇవాళ థియేటర్లలోకి వచ్చిన విరూపాక్ష పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని డీసెంట్ ఓపెనింగ్స్ దిశగా సాగుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా ఉత్కంఠ రేపే సీన్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ సినిమాలో సంయుక్త మీనన్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. క్లైమాక్స్ సీన్స్ లో సంయుక్త నటనకు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. సంయుక్త సీన్స్ కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని అంటున్నారు.

భీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ మలయాళీ భామ అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరై వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. భీమ్లా నాయక్, బింబిసార, సార్ సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్న సంయుక్త విరూపాక్ష సినిమాతో ఆ పరంపర కొనసాగించింది. గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సంయుక్త మరోసారి తన సత్తా చాటింది.

ప్రస్తుతం డెవిల్ సినిమాలో నటిస్తున్న సంయుక్త మీనన్, కళ్యాణ్ రామ్ సరసన నటించటం ఇది రెండోసారి. బింబిసార సినిమాతో హిట్ అందుకున్న ఈ కాంబినేషన్ డెవిల్ ద్వారా ఇంకో హిట్ అందుకుంటుందని అంటున్నారు. ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ హిట్ అవ్వటం వల్ల సంయుక్త కి గోల్డెన్ లెగ్ అన్న ట్యాగ్ ఇచ్చేసారు సినీ జనాలు. తెలుగు నటులతో సమానంగా తెలుగు మాట్లాడి అందరినీ ఆశ్చర్య పరుస్తున్న సంయుక్త టాప్ హీరోయిన్ స్థాయికి చేరుతుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు