Samyuktha Menon: గ్లామర్ డోర్స్ ఓపెన్ చేసిన సంయుక్త..స్లీవ్‌ లెస్‌ వేసుకుని మరీ !

 

Samyuktha Menon: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బ్యూటీ పాప్ కార్న్ అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా తన కెరియర్ ప్రారంభించింది. ఈ బ్యూటీ కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదగడానికి విపరీతంగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యింది.

ఈ సమయంలోనే ఈ బ్యూటీ బీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఈ బ్యూటీ కీలకపాత్రలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న సంయుక్త మీనన్…. బింబిసారా, సార్, విరూపాక్ష వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ బ్యూటీకి ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. స్టార్ హీరోల సరసన జతకట్టే అవకాశాలను సైతం ఈ బ్యూటీ అందుకుంటుంది.

- Advertisement -

ఇక ఈ బ్యూటీ కేవలం సినిమాల పరంగానే కాకుండా….. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకుంటుంది. వరుస ఫోటోషూట్లతో తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది.

actress samyuktha menon latest beautiful saree photos | Samyuktha Menon: చీరలో సంయుక్త- యువరాణిలా మెరిసిపోతున్న 'విరూపాక్ష' బ్యూటీ
ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ గోల్డ్ కలర్ శారీలో ఎంతో సాంప్రదాయంగా ముస్తాబయి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అచ్చ తెలుగు అమ్మాయిల నగలు వేసుకుని ఈ ముద్దుగుమ్మ తన అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ చీరలో చాలా సింపుల్ లుక్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ ఫోటోలు చూసిన సంయుక్త అభిమానులు ఎంతో అందంగా, కుందనపు బొమ్మలా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు