Samyuktha Menon : ’ప్రకాశించే రాక్ స్టార్‘

కెరీర్ లో ఎక్కువగా మలయాళ చిత్రాల్లో నటించిన క్యూట్ హీరోయిన్ సంయుక్త మీనన్. తమిళం, కన్నడలో కొన్ని చిత్రాల్లో యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది పవన్ కళ్యాణ్, రాణా ‘భీమ్లా నాయక్’ వంటి భారీ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ‘బింబిసార’ మూవీలో కూడా ఈ బ్యూటీ నటించింది. అయితే ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సంయుక్త.

ఈ మూవీ కోసం టీమ్ మొత్తం ఎంతో కష్టపడ్డారని, ముఖ్యంగా హీరో కళ్యాణ్ రామ్ ప్రాణం పెట్టి నటించారని తెలిపింది. తప్పకుండా బింబిసార మంచి విజయం అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అలానే టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, మహేష్, పవన్ ల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇటీవల బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్ తో మాట్లాడానని చెప్పింది. ఎన్టీఆర్ నటన ప్రావీణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అని అన్నారు. ఇక పవన్ గురించి ఒక్క మాటలో చెప్పడం కష్టమని తెలిపింది. పవన్ ఎందరికో ఇన్స్పిరేషన్ అన్నారు. అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ, మహేష్ ఎల్లప్పుడూ ప్రకాశించే రాక్ స్టార్ వంటి వారని అన్నారు. సూపర్ స్టార్ పక్కన మూవీ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఆమె చెప్పారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు