SamyukthaMenon: ఊర చూపులతో రచ్చ చేస్తున్న సంయుక్త

SamyukthaMenon: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో అందాల ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బ్యూటీ 2016 సంవత్సరంలో మలయాళం సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. తమిళ్, కన్నడ, తెలుగు భాషల్లో కూడా సినిమాలు చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది.

SamyukthaMenon saree photos

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కీలక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది సంయుక్త. ఆ సినిమా అనంతరం బింబిసారా, సార్ ఇలాంటి బంపర్ హిట్ సినిమాలలో నటించి భారీ విజయాన్ని అందుకుంది.

సాయి ధరంతేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాలో హీరోయిన్గా నటించి తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో అభిమానుల ముందుకు వస్తూనే ఉంది. ఈ బ్యూటీ సినిమాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.

- Advertisement -

వరుస ఫోటోషూట్లు చేస్తూ తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. తాజాగా సంయుక్త సాంప్రదాయంగా చీర కట్టులో దిగిన కొన్ని ఫోటోలను తన అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫోటోల్లో సంయుక్త చాలా సాంప్రదాయంగా, అందంగా ఉంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు