Raayan : రాయన్ సినిమాలో ఆ పాత్రకు మొదటి ఆప్సన్ సందీప్ కిషన్ కాదు

Raayan : ప్రస్తుత కాలంలో తెలుగు సినిమా తమిళ్ సినిమా మలయాళం సినిమాని కాకుండా అందరూ కూడా సౌత్ సినిమా అని మాట్లాడటం మొదలు పెడుతూ ఉన్నారు. ఎందుకంటే భాషతో సంబంధం లేకుండా మిగతా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు కూడా ఇతర భాషల్లో వర్క్ చేస్తున్నారు. చాలామంది తమిళ్ హీరోలు ఇప్పటికే తెలుగు దర్శకులతో పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. మలయాళం హీరోలు కూడా తెలుగు దర్శకులతో చేయడానికి ఇష్టపడుతున్నారు.

తమిళ్ లో ఉన్న స్టార్ హీరోస్ లో ధనుష్ ఒకరు. ధనుష్ గురించి ప్రత్యేకంగా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలు చేశాడు ధనుష్. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడుగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ధనుష్ చేసిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి. ఇక రీసెంట్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే సినిమా చేసి తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత దగ్గర అయ్యాడు ధనుష్.

Dhanush's 'Raayan'

- Advertisement -

ఇక ప్రస్తుతం ధనుష్ దర్శకుడుగా కూడా ఒక సినిమాను చేశాడు. ఆ సినిమా పేరు రాయాన్. ఈ సినిమా జులై 26న రిలీజ్ ఏ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ను అందుకుంది. ఈ సినిమా ఇప్పటికే దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ను వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ ధనుష్ తమ్ముడుగా ఒక కీలక పాత్రలో కనిపించాడు. ఈ పాత్రతో సందీప్ కిషన్ కి అద్భుతమైన పేరు వచ్చింది. అయితే ఈ పాత్రకి మొదట విష్ణు విశాల్ ను తీసుకుందామని అనుకున్నారట కానీ విష్ణు విశాల్ కి ఉన్న బిజీ షెడ్యూల్స్ వలన ఈ సినిమాకి డేట్స్ ఇవ్వలేకపోవడంతో సందీప్ కిషన్ ని తీసుకున్నారు. ఏదేమైనా ఆ క్యారెక్టర్ ఈ సినిమాకి మంచి ప్లస్ అయింది అలానే సందీప్ కెరీర్ కి కూడా మంచి ప్లస్ అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు