Sundeep Kishan : ‘మిరాయ్’ కథను చెయ్యాల్సింది సందీప్ కిషన్ చెయ్యాల్సింది, కానీ ఏమైందంటే..

Sundeep Kishan : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో సందీప్ కిషన్ ఒకడు. ముందుగా స్నేహగీతం, ప్రస్థానం లాంటి సినిమాల్లో కీలకపాత్రలో కనిపించాడు సందీప్ కిషన్. ఆ తర్వాత చేసిన రొటీన్ లవ్ స్టోరీ, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వంటి సినిమాలు సందీప్ కిషన్ కి మంచి హిట్ గా నిలిచి ఒక గుర్తింపును తీసుకొచ్చాయి. అయితే సందీప్ కిషన్ ఎప్పుడూ కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ముందు ఉంటాడని చెప్పొచ్చు. ఇదివరకే చాలా సినిమాలను కొత్త దర్శకులతో చేశాడు సందీప్ కిషన్. వాస్తవానికి సందీప్ రెడ్డి వంగ కూడా సందీప్ కిషన్ తో అర్జున్ రెడ్డి సినిమాను చేయాల్సి ఉంది. వీరిద్దరూ కలిసి కొంతకాలం ట్రావెల్ కూడా అయ్యారు. అయితే అప్పటికే ప్రస్థానం సినిమాలో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయడంతో మళ్లీ సందీప్ కిషన్ కి అది ఎందుకో వర్కౌట్ కాదని చెప్పి దానిని రిజెక్ట్ చేశాడు. ఆ సినిమా అర్జున్ రెడ్డి అయి బ్లాక్ బస్టర్ గా మారింది.

ఇకపోతే నగరం సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు లోకేష్ కనకరాజ్. లోకేష్ కనకరాజ్ ను గుర్తించి తనకంటూ ఒక అవకాశం ఇచ్చి ఒక దర్శకుడుగా నిలబెట్టాడు సందీప్ కిషన్. ఇప్పటికీ లోకేష్ కనకరాజ్ కి, సందీప్ కిషన్ కి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. సందీప్ కిషన్ నటించిన మైఖేల్ సినిమాని తమిళ్లో లోకేష్ కనకరాజ్ ప్రజెంట్ చేశారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ బాబు కూడా మొదటి సందీప్ కిషన్ తో రారా కృష్ణయ్య అనే సినిమాను చేశాడు. ఈ సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది. అయితే ఇలా ఎంతోమంది కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేశాడు సందీప్ కిషన్. ఇక రీసెంట్ గా ఊరు పేరు భైరవకోన సినిమాతో మంచి హిట్ ను తన సొంతం చేసుకున్నాడు సందీప్.

Sundeep Kishan

- Advertisement -

ధనుష్ దర్శకత్వంలో రాయన్

ఇక సందీప్ కిషన్ ప్రస్తుతం ధనుష్ దర్శకత్వంలో రాయన్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమా జూలై 26న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇ తరుణంలో చాలా ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నాడు సందీప్ కిషన్. రీసెంట్ గా ఒక ఎలక్ట్రానిక్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర విషయాలను తెలిపాడు.

చిరంజీవి – సిద్ధూ జొన్నలగడ్డ కోసం అనుకున్న కథతోనే మీ ‘మజాకా’ రూపొందుతుందా? అనే ప్రశ్నకు సమాధానంగా… సిద్ధూ జొన్నలగడ్డ కాదు అండి, చిరంజీవి గారు- తేజ సజ్జ కాంబినేషన్లో ఆ సినిమా తెరకెక్కాల్సి వుంది. కానీ ఇప్పుడు నేను – రావు రమేష్ గారు చేస్తున్నాం. వాస్తవానికి ‘మిరాయ్’ సినిమా నేను చేయాలి. నాకు ఆ కథ బాగా నచ్చింది. కానీ అది తేజ సజ్జకి వెళ్ళింది అంటూ సందీప్ చెప్పాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు