Sandeep Reddy Vanga: మహానటి సినిమా తెచ్చి పెట్టిన చిచ్చు, ఇద్దరు దర్శకులు మధ్య డిఫరెన్స్ రావడానికి కారణం ఇదేనా

ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం నడుస్తుంది అని అంటారు. అలా తెలుగు సినిమా ఫిలిం ఇండస్ట్రీకి కూడా ఒక టైం నడిస్తే అది 2017 నుండి మొదలైంది అని చెప్పొచ్చు. ఆ టైంలో చాలామంది కొత్త దర్శకులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తమ సత్తాను చాటారు. వారిలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ ఒకరు. అర్జున్ రెడ్డి అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన సంచలనం తక్కువ ఏమీ కాదు. అప్పట్లో రాంగోపాల్ వర్మ శివ సినిమా ఎంతటి ఇంపాక్ట్ కలిగించిందో అంతటి ఇంపాక్ట్ ను అర్జున్ రెడ్డి సినిమాతో ఇచ్చాడు సందీప్ రెడ్డి.

అయితే సందీప్ రెడ్డి 100 అర్జున్ రెడ్డి సినిమాను పట్టాలెక్కించడానికి నాన్న కష్టాలు పడ్డాడు. మొదటి ఈ సినిమాకి శర్వానండ్ ను హీరోగా అనుకున్నాడు. వైజయంతి బ్యానర్ స్వప్న దత్ కూడా ప్రొడ్యూసర్ గా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు. కానీ చివరి నిమిషంలో ఈ సినిమా ఎందుకో పట్టాలెక్కలేదు. అయితే అర్జున్ రెడ్డి సినిమా కంటే ముందు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత, ఈ సినిమాను స్వయంగా వాళ్లే నిర్మించాలి అని కూడా ఫిక్స్ అయిపోయారు. మొత్తానికి సందీప్ రెడ్డివంగా తమ ఆస్తులన్నిటిని అమ్మి ఈ సినిమా కోసం ప్రొడ్యూస్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. వెంటనే బాలీవుడ్ లో ఇదే సినిమాను రీమేక్ చేసి అక్కడ కూడా బీభత్సమైన హిట్ సాధించాడు.

 

- Advertisement -

Mahanati

మహానటి సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం

ఇకపోతే ఈ ప్రాసెస్లో సందీప్ రెడ్డి వంగా పైన చాలామంది బాలీవుడ్ ప్రముఖులు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. కొంతమంది సందీప్ రెడ్డి సినిమాకి నెగిటివ్ కామెంట్స్ కూడా ఇచ్చారు. కబీర్ సింగ్ అనే సినిమాను వైలెంట్ ఫిలిం అని చెప్పుకొచ్చారు. అసలైన వైలెంట్ ఫిలిం అంటే ఏంటో నేను చూపిస్తాను అంటూ అనిమల్ సినిమాను తెరకెక్కించాడు సందీప్ రెడ్డి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఈ తరుణంలో చాలామందికి ఇంటర్వ్యూ ఇచ్చాడు సందీప్ రెడ్డి. ఒక ప్రముఖ సినీ క్రిటిక్ జర్నలిస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహానటి సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం తనకు వచ్చింది ఒక టైంలో అంటూ చెప్పుకొచ్చాడు. అలానే మహానటి సినిమా తనకు బాగా నచ్చిందని ఒకవేళ నేను చేసి ఉంటే ఇంకోలా ఉండేది అని ఒక సందర్భంలో చెప్పాడు సందీప్ రెడ్డి. అయితే ఆ మాటలను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.

నేడు ఆ వీడియో ఒకటి వైరల్ గా మారింది. కల్కి సినిమా వెయ్యి కోట్లు సాధించిన సందర్భంగా నాగ అశ్విన్ ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీ ను పెట్టాడు. ఎటువంటి వైలెన్స్ రక్తపాతం లేకుండా 1000 కోట్లు సినిమా చేశాము అని ఆ పోస్ట్ ఉద్దేశం. అయితే ఇది సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేసి పెట్టాడు అని కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో పోస్ట్లు కనిపించిన తర్వాత దానిని డిలీట్ చేశాడు నాగ్ అశ్విన్. అయితే దీనికి కారణం ఇదే కావచ్చు అంటూ గతంలో మహానటి సినిమా సందీప్ రెడ్డి వంగ చేసిన కామెంట్స్ వీడియోను పోస్ట్ చేసి కొంతమంది పోస్ట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు