Sangeetha: డబ్బు కోసమే ఆ కమెడియన్ ని వివాహం చేసుకుందా..?

Sangeetha.. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు? ఎవరి వివాహం? ఎలా? ఎవరితో జరుగుతుందో ? చెప్పడం అసాధ్యం.. డబ్బు కోసమో.. తోడు కోసమో.. లేక తాము ప్రేమించిన వ్యక్తిని సొంతం చేసుకోవడం కోసమో.. ఇలా ఏదో ఒక రకమైన కారణం తో లేటు వయసులో పెళ్లిళ్లు చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అలాంటి వారిలో కోలీవుడ్ సీరియల్ నటి సంగీత కూడా ఒకరు.. ఈమె 46 సంవత్సరాల వయసున్న కమెడియన్ రెడిన్ కింగ్స్ లీని వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.

రెడిన్ కింగ్స్ లీ సినీ ప్రయాణం..

అతి కొద్ది మంది బంధుమిత్రుల మధ్య వీరి వివాహం చాలా ఘనంగా జరిగింది. రెడిన్ కింగ్స్ లీ సినిమాల మీద ఆసక్తితోనే కోలమావు కోకిల సినిమా ద్వారా ఇండస్ట్రీకి అడుగుపెట్టి ఆ తర్వాత శివ కార్తికేయన్ హీరోగా నటించిన డాక్టర్ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.. అంతే కాదు ఈయన కామెడీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.. ఈ సినిమా తర్వాత తర్వాత ఎల్కేజీ , అన్నాత్తే , బీస్ట్, కాతు వాకుల రెండు కాదల్ ,మార్క్ అంటోనీ ,మట్టి కుస్తీ, జైలర్ వంటి సినిమాల ద్వారా స్టార్ కమెడియన్ గా సెటిల్ అయిపోయారు..

46 యేళ్ళ వ్యక్తితో పెళ్లి..

Sangeetha: Did Sangeetha marry that comedian for money?
Sangeetha: Did Sangeetha marry that comedian for money?

గత ఏడ అదే వీరిద్దరూ వివాహం చేసుకోవడంతో ఈ వివాహం చూసి అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడమే కాదు పలు రకాల విమర్శలు కూడా గుప్పించారు.. ముఖ్యంగా ఇందులో సంగీత డబ్బు కోసమే రెడిన్ కింగ్స్ లీ ని వివాహం చేసుకుందని.. సంగీత కి అప్పటికే వివాహం జరిగి.. ఒక ఆడపిల్ల కూడా ఉందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి..అయితే దీనిపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించిన సంగీత రూమర్స్ కి చెక్ పెట్టేసింది..

- Advertisement -

రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన సంగీత..

సంగీత మాట్లాడుతూ నాకు అప్పటికే పెళ్లయి కూతురు ఉంది అని అంటున్నారు కదా.. ఆమె నా కూతురు కాదు.. నా తమ్ముడి కూతురు.. నేను డబ్బు కోసం రెడిన్ కింగ్స్ లీని వివాహం చేసుకున్నాను అని అంటున్నారు.. నేను సీరియల్స్ లో నటిస్తున్నాను.. బాగా సంపాదించాను.. ఏమీ లేకుండానే నేను ఈ స్థాయికి రాలేదు.. డబ్బు కోసం కాదు.. రెడిన్ కింగ్స్ లీ వ్యక్తిత్వం చూసి.. ఆ కారణంతోనే నేను వివాహం చేసుకున్నానే తప్ప అతడు సంపాదించిన డబ్బు కోసమో లేదా అతడి దగ్గర ఉన్న గుర్తింపు కోసమో.. నేను అతడిని వివాహం చేసుకోలేదు అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది.. అయితే తనకంటే వయసులో పెద్దవాడిని వివాహం చేసుకోవడానికి గల కారణం.. అతడు అంటే ఇష్టమని… అతడి వ్యక్తిత్వమే అతడిని పెళ్లి చేసుకునేలా తనను మార్చిందని సంగీత వెల్లడించింది.. మొత్తానికైతే సంగీత చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.. ఏది ఏమైనా గత కొన్ని రోజులుగా తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ కి ఆమె స్పందించి ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు