Sanjana Galrani: కొత్త అమ్మాయిలే టార్గెట్.. ఏకంగా సీఎంనే కలిసిన హీరోయిన్..!

Sanjana Galrani.. జస్టిస్ హేమా కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత చాలామంది నటీమణులు తమపై జరిగిన లైంగిక దాడుల గురించి ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా అన్ని భాషలలోని సినీ పరిశ్రమలో మహిళలపై అఘాయిత్యాలను నివారించడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అవేవీ కూడా ఆగడాలను అరికట్ట లేకుండా పోతున్నాయి. ముఖ్యంగా సౌత్ సినీ ఇండస్ట్రీలోని అన్ని భాష పరిశ్రమలలో మహిళలు ఇలా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు.

Sanjana Galrani: New girls are the target.. The heroine who met the CM at the same time..!
Sanjana Galrani: New girls are the target.. The heroine who met the CM at the same time..!

కమిటీ వేయాలని ముఖ్యమంత్రిని కలిసిన సంజన..

ఇక టాలీవుడ్ లో కూడా సమంత, అనుష్క శెట్టి లాంటి స్టార్ హీరోయిన్లు కూడా టాలీవుడ్ లో కూడా హేమా కమిటీ లాంటి కమిటీ వేయాలి అంటూ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే తమకి కూడా హేమా కమిటీ లాంటి కమిటీ కావాలని కన్నడ నటీమణులు.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలసి వినతిపత్రం అందజేశారు. వీరితోపాటు హీరోయిన్ సంజన గల్రాని (Sanjana Galrani) కూడా ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు. వారికే అన్యాయం జరుగుతోంది. నిర్మాతల మాటలు నమ్మి తమ కెరియర్ నాశనం చేసుకుంటున్నారు అంటూ ఆమె తెలిపింది. ముఖ్యంగా కొంతమంది అమ్మాయిలు సినిమాలలో అవకాశాల కోసం వచ్చి ఇలాంటివి తట్టుకోలేక వెను తిరిగి వెళ్ళిపోతున్నారని స్పష్టం చేసింది.

కొత్త అమ్మాయిలే టార్గెట్..

కన్నడ సినీ పరిశ్రమలో కూడా నటీమణుల సంఘం ఉండాలి అని, దీనికి ఒక సీనియర్ నటి అధిపతిగా ఉండాలి అని, మరొకరు మన వయసున్న నటి అయి ఉండాలి. ఇందులో ప్రభుత్వం నుంచి ఒక మహిళ అధికారి కూడా కలుపుకుంటే మరింత బలం ఉంటుంది అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అంతే కాదు ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త అమ్మాయిలకు చాలా అన్యాయం జరుగుతోంది. అలాంటి వారికి హక్కులు ఏమిటో..? అధికారం ఏమిటో.. ?అసలు వారు ఏం చేయాలి..? ఏం చేయకూడదు.. ?అనే విషయాలు చెప్పడానికి ఇక్కడ ఎవరూ లేరు. శాండిల్ వుడ్ వుమెన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారికి మార్గ నిర్దేశం చేస్తోంది. కొత్త హీరోయిన్ ఎవరైనా వస్తే ఈ సంఘంలో చేరండి. అసోసియేషన్ రూల్ బుక్ చూద్దాం.. ముఖ్యంగా కొత్తవారు తమకు వచ్చిన అవకాశాలను ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేర్చుకోవాలి. ఎవరో వచ్చి నిర్మాత అని చెప్పగానే వారికి ఏం తెలియదు కాబట్టి నమ్మేస్తారు. ఆరు నెలల్లో ఆ కొత్త అమ్మాయిలతో ఏం జరుగుతుంది అదంతా కెమెరాలో చెప్పడం కుదరదు అంటూ సంజనా గల్రాణి తెలిపింది.

- Advertisement -

అమ్మాయిలను వేలం వేస్తున్నారు..

కొంతమంది నకిలీ వ్యక్తులు సినిమా పరిశ్రమను చెడగొడుతున్నారు. ఇవన్నీ కొత్త ఆడపిల్లలకు నేర్పించేలా ఒక కొత్త సంఘం కృషి చేయాలి. ఈ సంఘాన్ని ప్రారంభించడానికి అనుమతించాలి అంటూ కోరుకుంది. సమస్యను పరిష్కరించడమే తమ లక్ష్యం. కొత్త అమ్మాయిలను వేలం వేయకూడదు. అలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఆర్టిస్టుల సంఘం కావాలి అంటూ సంజన చెప్పుకొచ్చింది. దీన్ని బట్టి చూస్తే ప్రతి భాషా ఇండస్ట్రీలో కూడా ఆడవారు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని స్పష్టం అవుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు