Sanjay Dutt: ఆడపడుచు పోరు.. సంచలన నిర్ణయం తీసుకున్న సంజయ్ దత్ భార్య..!

Sanjay Dutt.. సాధారణంగా ఏ కుటుంబంలో అయినా సరే అత్తమామలు, ఆడపడుచులు కోడల్ని కూతురుగా చూసుకోవడం లేదా కోడలు వారితో కూతురులా కలిసిపోవడం నూటికో కోటికో సాధ్యం అనే చెప్పాలి. కొత్త కుటుంబంలో అడుగుపెట్టే అమ్మాయికి కోడలు హోదాలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అందరికీ తెలిసిందే.. అయితే సెలబ్రిటీల విషయంలో ఇదంతా జరగదు.. సెలబ్రిటీలు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు అని అందరూ అనుకుంటారు .అయితే అదంతా ఏమీ లేదని తాను కూడా అత్తమామలు ఆడపడుచుల పోరు భరించాను అంటూ ప్రముఖ స్టార్ హీరో భార్య మీడియాతో చెప్పుకొని ఎమోషనల్ అయ్యింది..

Sanjay Dutt: The wife of Sanjay Dutt took a sensational decision..!
Sanjay Dutt: The wife of Sanjay Dutt took a sensational decision..!

అత్తమామలు – ఆడపడుచు పోరు ఎదుర్కొన్నాను..

ఇక స్టార్ హీరో ఎవరు? ఆయన భార్య ఎవరు ?అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. వారెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్. ఆయన భార్య మాన్యతా దత్.. సంజయ్ ను వివాహం చేసుకొని అత్తవారింట్లో అడుగుపెట్టినప్పుడు సంజయ్ దత్ కుటుంబంతో కలిసి పోవడానికి మొదట్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని మాన్యతా దత్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. 2008లో సంజయ్ దత్ ను వివాహం చేసుకుంది. మాన్యత ఆ ఇంట్లో అడుగు పెట్టాక అత్తమామలు ఆడపడుచుల నుండి అంగీకారం పొందడానికి ఎంతో సమయం పట్టింది. కొత్త ఇంటికి వెళ్లడం, వారితో మమేకం కాలేకపోవడం వల్లే కష్టంగా అనిపించింది అంటూ మాన్యతా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

ఆ కేసులో ఇబ్బంది పడ్డ సంజయ్ దత్..

తెరపై భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సంజయ్ దత్ మారకద్రవ్యాల వ్యసనం, పోలీస్ కేసులతో తన జీవితాన్ని మరింత కష్టతరం చేసుకున్నాడు. కానీ ఆయన జీవితంలోకి మాన్యత వచ్చిన తర్వాత ఎన్నో అనూహ్యమైన మలుపులు చోటుచేసుకున్నాయి. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్న సంజయ్ కి మద్దతుగా నిలిచింది. అతడి కష్టాలను పంచుకొని అతడికి అండగా నిలిచింది. అయితే మాన్యతా మాత్రం అత్తవారింట్లో స్థిరపడడానికి ఎంతో కష్టపడింది… తనను అంగీకరించేలా.. ఎన్నో ప్రయత్నాలు చేశానని తెలిపింది.. ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సంజయ్ సోదరీమణులతో అంగీకారం పొందడానికి నేను నా సామర్థ్యాన్ని కంటే మించి ప్రయత్నించాను అది సంజయ్ కి కూడా తెలుసు. అంతకుమించి నన్ను నేను పుష్ చేసుకోవడం నా భర్తకు ఇష్టం లేదు.. నేను కూడా అలా చేయదలచుకోలేదు అంటూ తెలిపింది.

- Advertisement -

బెటర్ ఆఫ్ కాదు బెస్ట్ ఆఫ్..

ఇకపోతే పెళ్లి తర్వాత నాపై వచ్చిన నెగెటివిటీస్ ఎంతగానో నన్ను ఇబ్బందులకు గురి చేశాయి. నేను సంజయ్ దత్ జీవితంలోకి అనవసరంగా ప్రవేశించానని విమర్శించారు. ముఖ్యంగా నన్ను నిందించడానికి నా పాత జీవితాన్ని తెరపైకి తీసుకువచ్చారు.. నాకు తెలుసు కానీ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే.. నా భర్తతో నాకు నచ్చిన విధంగా జీవించే హక్కు నాకుంది. అది వేశ్య అయినా , యువరాణి అయినా పర్వాలేదు.. భర్త ఇంట్లో భార్యకే కొన్ని హక్కులు ఉంటాయి.. నేను నా భర్తతో నివసిస్తాను అంటూ మాన్యత తెలిపింది. ఇక ఎన్నో కష్టాలను ఎదుర్కొని, చివరికి సంజయ్ దత్ సోదరీమణులతో అలాగే సంజయ్ దత్ మొదటి వివాహంలో జన్మించిన కుమార్తె త్రిషా దత్ తో కూడా మాన్యత మంచి సంబంధాలను పెంచుకుంది. ఇక తనకు ఎప్పుడూ సహాయాన్ని అందించే తన భార్యకు సంజయ్ దత్ కూడా కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాదు మాన్యత తన బెటర్ ఆఫ్ కాదని బెస్ట్ హాఫ్ అని చెప్పుకొచ్చాడు సంజయ్ దత్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు