Sanjeeda Shaik : నైట్ క్లబ్ లో తాకరాని చోట… చేదు అనుభవాన్ని బయటపెట్టిన హీరామండి హీరోయిన్

Sanjeeda Shaik : హిరామండి వెబ్ సిరీస్ లో నటించిన హీరోయిన్ సంజీదా షేక్ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించింది. నైట్ క్లబ్ లో ఓ రోజు జరిగిన దారుణమైన ఘటనను ఆమె తాజాగా పంచుకున్నారు. సంజీదాతో అసభ్యంగా ప్రవర్తించిన ఆ వ్యక్తి ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే..

హిరామండి నటికి చేదు అనుభవం

గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ‘హిరామండి’ వెబ్ సిరీస్ గురించే చర్చ జరుగుతోంది. ఈ సిరీస్‌కి అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కానీ ఈ ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్ అవుతోంది. అయితే ఈ సిరీస్ లో ఓ పాత్రలో నటించిన సంజీదా షేక్ ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నటి సంజిదా మాట్లాడుతూ ఒక పబ్‌లో ఈ సంఘటన జరిగిందని చెప్పుకొచ్చింది. అయితే ఆ ఘటన ఇప్పటిది కాదు. చాలా సంవత్సరాల క్రితమే జరిగిన విషయం గురించి ఎట్టకేలకు తన మౌనాన్ని వీడింది.

ఆ ఇంటర్వ్యూలో సంజీదా నైట్ క్లబ్‌లో జరిగిన షాకింగ్ సంఘటనను వివరించింది. ఆమె మాట్లాడుతూ ‘నాకు జరిగిన ఓ సంఘటన ఇప్పటికీ గుర్తుంది. ఆ పని చేసింది ఓ అమ్మాయి. నేను నైట్ క్లబ్‌లో ఉన్నాను. నా పక్కనే ఒక అమ్మాయి నడుస్తోంది. ఆమె నా ప్రైవేట్ పార్ట్స్ తాకింది. నేను షాక్ అయ్యాను.. కాసేపటి దాకా నాకు ఏమి జరిగిందో అస్సలు అర్థం కాలేదు. స్త్రీ పురుషులతో సంబంధం లేదు. తప్పు ఎవరు చేసినా తప్పే’ అని సంజీదా అప్పట్లో జరిగిన ఘటనను గుర్తు చేసుకుంది.

- Advertisement -

Sanjeeda Shaikh Says Irrfan Khan Is Her Inspiration: He Used To Feel Like  He Won't Be Able To Do That Scene And... | EXCLUSIVE | Times Now

నటి సంజిదా షేక్ గురించి మాట్లాడుతూ, నటి చాలా సంవత్సరాలుగా బాలీవుడ్‌లో చురుకుగా ఉంది. ఈ నటి 2003లో విడుదలైన ‘బాగ్‌బాన్’ చిత్రంతో పెద్ద తెరపైకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సంజిదా వెనుదిరిగి చూడలేదు.

సంజీదా షేక్ ఎవరు?

సంజీదా హిందీలోనే కాకుండా తమిళం, కన్నడ, పంజాబీ చిత్రాలలో కూడా నటించారు. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ హిందీలో మాత్రం బుల్లితెర నుంచి బిగ్ స్క్రీన్ ప్రేక్షకుల దాకా అందరికీ బాగా తెలుసు. ఆమె ‘క్యా హోగా నిమ్మో కా’, ‘ఖయామత్’, ‘క్యా దిల్ మే హై’, ‘పియా కా ఘర్ ప్యారా లగే’ వంటి సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు పోషించి అభిమానులను అలరించారు.

సింగిల్ మదర్

సంజీదా వ్యక్తిగత జీవితం గురించిన విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. విడాకుల తర్వాత ఈ అమ్మడు సింగిల్ మదర్ గా మారింది. తరచుగా తన కుమార్తెతో ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.

హీరామండి పార్ట్ 2 లోడింగ్

సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ‘హీరమండి: ది డైమండ్ బజార్’ సిరీస్ భారీ వ్యూస్ ను దక్కించుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్‌ను ప్రేక్షకులు పెద్ద ఎత్తున వీక్షించారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ హీరామండి సెకండ్ పార్ట్ లోడింగ్ అవుతోంది అంటూ ప్రకటించగా, ఇది విని అభిమానులు థ్రిల్ అవుతున్నారు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు