Mallidi Vassishta: ఒకే ఏడాదిలో సంక్రాంతి దసరాకి తన సినిమాలను దించుతున్నాడు, కానీ ట్విస్ట్ ఏంటంటే

Mallidi Vassishta: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న ఆసక్తికరమైన ప్రాజెక్టులలో విశ్వంభర సినిమా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే బిబిసారా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు వశిష్ట. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. దాదాపు కళ్యాణ్ రామ్ పరిస్థితి అయిపోయింది అనుకునే టైంలో ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరియర్ కు పెద్ద ప్లస్ అయింది. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ వరుస సినిమాలు చేసుకుంటూ కెరియర్లో ముందుకు వెళుతున్నాడు.

దర్శకుడు వశిష్ట తన మొదటి సినిమా బింబిసార సోసియో ఫాంటసీ జోనర్ లో చేసాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు వశిష్ట. ఇకపోతే రెండవ సినిమాకి మెగాస్టార్ చిరంజీవితో అవకాశం రావడం అనేది మామూలు విషయం కాదు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలా మంది కలలు కంటున్నారు. ఎంతోమంది దర్శకులకి మెగాస్టార్ తో ఆల్మోస్ట్ కథ ఓకే అయిపోయింది అనుకునే తరుణంలో కూడా ఆ సినిమా రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి.

ఇక విశ్వంభర సినిమా విషయానికి వస్తే సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తయిపోయే స్థాయిలో ఉంది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ వర్క్ కూడా మొదలుపెట్టారు. ఈ సినిమాను జనవరి 10న రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు. అయితే మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ కి ఒక పర్ఫెక్ట్ సినిమా పడితే అది కూడా పండగ సీజన్ అయితే కలెక్షన్లు వేరే రేంజ్ లో వస్తాయి. ఇప్పుడు దాదాపు ఈ సినిమాకి అదే రిపీట్ అయినట్లు కనిపిస్తుంది. ఈ సినిమా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయితే మెగాస్టార్ చిరంజీవి స్థాయి ఏంటో మరోసారి బాక్సాఫీస్ వద్ద ప్రూవ్ అవుతుంది.

- Advertisement -

Chiranjeevi

ఇక సంక్రాంతికి ఈ సినిమా రావడంతో పాటు దసరాకి బింబిసారా సీక్వెలను రిలీజ్ చేసే పనిలోపడ్డాడు వశిష్ట. అయితే ఈ సినిమాకి దర్శకుడు మాత్రం వశిష్ట కాదు. ఎప్పటినుంచో సీనియర్ టెక్నీషియన్ గా ఉన్న ఒక వ్యక్తి మొదటిసారి డైరెక్షన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా రేపు ఈ విషయాన్ని రీవీల్ చేయనున్నారు. బింబిసారా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దానికి సీక్వల్ గా వస్తున్న సినిమా అంటే అంచనాలు తారస్థాయిలో ఉంటాయి. మరి కొత్త దర్శకుడు ఆ స్థాయిని అందుకుంటాడా లేదా అనేది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడకు తప్పదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు