2023 Sankranthi Recap: మర్చిపోలేని సంక్రాంతి వార్… నెగ్గింది ఎవరు..?

2023 Sankranthi Recap: తెలుగు సినిమాకి సంక్రాంతి పండుగ అతిపెద్ద మార్కెట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ సీజన్ ను టార్గెట్ చేసుకొని సినిమాలను దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తూ ఉంటారు. సినిమా ప్రేక్షకులను మెప్పిస్తే ఖచ్చితంగా ఆ సినిమా వసూళ్ళ వర్షం కురిపిస్తుంది. అయితే 2021, 2022 కరోనా సమయంలో పెద్ద చిత్రాలు ఏవీ రిలీజ్ కాలేదు కానీ గత ఏడాది  మాత్రం స్టార్ హీరోలు 2023 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడ్డారు. మరి గత ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిత్రాలు ఏవి? సంక్రాంతి బరిలో దిగి పోటీలో గెలిచిందెవరు..? ఎంత కలెక్షన్స్ రాబట్టాయి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
తెగింపు:
:Ajith
2023 సంక్రాంతి కానుకగా హెచ్.వినోద్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా వచ్చిన చిత్రం తెగింపు.. తమిళంలో తునివు పేరిట రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగులో తెగింపు అనే టైటిల్ తో 2023 జనవరి 11న విడుదల అయింది. తమిళంలో బోణీ కపూర్ నిర్మించగా.. తెలుగులో రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ తో పాటు ఐ వి వై ప్రొడక్షన్స్ సంస్థలు విడుదల చేశాయి. ఇందులో మంజు వారియర్ హీరోయిన్ గా నటించగా .. సముద్రఖని, మమతీ చారి, సిబి భువన్ చంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. రూ.200 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పూర్తి రన్ ముగిసే సరికి.. ప్రపంచవ్యాప్తంగా రూ.186.77 కోట్ల గ్రాస్ , రూ.96.30 కోట్ల షేర్ వసూలు రాబట్టింది.
వాల్తేరు వీరయ్య:
veerayya
మెగాస్టార్ చిరంజీవి , మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో దర్శకుడు బాబి రూపొందించిన చిత్రం వాల్తేరు వీరయ్య.  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎర్నేని నవీన్ , రవి ప్రకాష్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల అయ్యి బ్రదర్ సెంటిమెంట్ తో  ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.  శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా కూడా రికార్డు నెలకొల్పింది.  మరి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. రూ.140 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం రూ .89 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ బరిలో దిగి… ప్రపంచవ్యాప్తంగా రూ.215 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.  డిస్ట్రిబ్యూటర్లకు రూ.70 కోట్ల మేరా లాభాలు అందించినట్లు సమాచారం.
వీర సింహారెడ్డి:
veera simha
నరసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎర్నేని నవీన్, రవి ప్రకాష్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాలో కూడా బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. రూ.70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.131.08 కోట్ల గ్రాస్ రాబట్టింది.
వారసుడు:
vaarasudu
కోలీవుడ్ హీరో విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు , శిరీష్,  పరమ్ వీ పొట్లూరి, పెరల్ వీ పొట్లూరి నిర్మించిన చిత్రం వారసుడు.. తమిళ్లో వారిసు పేరిట విడుదలైన ఈ సినిమా తెలుగులో సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది ఇకపోతే యావరేజ్ టాక్ తెచ్చుకుంది.  ప్రపంచవ్యాప్తంగా రూ.139 కోట్ల టార్గెట్ తో వచ్చిన ఈ సినిమా రూ.152.42 కోట్లు రాబట్టింది. అంటే దాదాపు రూ.11.42 కోట్ల ప్రాఫిట్ తో మంచి హిట్ స్టేటస్ సొంతం  చేసుకుంది.
కళ్యాణం కమనీయం:
Kalyanam
సంతోష్ శోభన్,  ప్రియా భవాని శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా గతేడాది జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అనిల్ కుమార్,  ఆళ్ల రచన దర్శకత్వంలో  UV క్రియేషన్స్ బ్యానర్ పై రూ .5కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా  రూ.7.21 కోట్లు రాబట్టింది.
ఇక ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద పెద్ద స్టార్ హీరోలు పోటీ పడ్డా.. ఎవరికి వారు తమ మార్క్ క్రియేట్ చేసుకున్నారు.
    Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు