Kalki 2898 AD : తవ్వినకొద్దీ బయట పడుతున్న క్యారెక్టర్లు… కల్కిలో ఈ మ్యూజిక్ డైరెక్టర్‌ను గమనించారా..?

Kalki 2898 AD : టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ప్రభాస్ నటించిన సినిమా కల్కి 2898 ad. నాగ్ అశ్విన్ తీసిన ఈ సినిమాను వైజయంతి మూవీ మేకర్స్ బ్యానర్ పై.. నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీత స్వరాలు అందించారు. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో… రూపొందిన ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే.

ముఖ్యంగా ఈ సినిమాలో బాలీవుడ్ నటులు.. ఉండడం ఈ సినిమాకు ప్లస్ అయింది. అమితాబచ్చన్, దిశాపటాని, కమల్ హాసన్ లాంటి వారు కీలక పాత్రల్లో కనిపించారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ, రాజమౌళి, మృనాల్ ఠాకూర్, నటి శోభ లాంటి సర్ప్రైజ్.. పాత్రలు కూడా ఈ సినిమాలో కనిపించాయి.

అయితే తాజాగా… ఈ సినిమాలో నటించిన మరో కొత్త పాత్ర బయటకి వచ్చింది. ఈ సినిమాలో సంతోష్ నారాయణన్ కూడా నటించారు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్‌ గా మారింది. అయితే.. సంతోష్ నారాయణన్ పాత్ర సెకండ్ల పాటు మాత్రమే ఉండటంతో ఎవరూ సరిగా కనిపించలేదని తెలుస్తోంది. ప్రభాస్ కాంప్లెక్స్ లోకి వెళ్లిన తర్వాత దిశా పటానీ – ప్రభాస్ మధ్య ఓ సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ లో సంతోష్ నారాయణ కనిపించాడు. కొన్ని సెకన్ల పాటే కనిపించిన సంతోష్ నారాయణను ఎవరూ గుర్తు పట్టలేదు. ఈ రోజు ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లోకి అందుబాటులోకి రావడంతో సంతోష్ నారాయణ గెస్ట్ రోల్ గురించి బయటికి వచ్చింది. కాగా, ఇదే సాంగ్ లో డైరెక్టర్ అనుదీప్ కూడా కనిపించాడు.  అయితే..ఈ సినిమాలో మాత్రం సంతోష్ నారాయణన్ కనిపించడం ఇప్పుడు హాట్‌ టాపిక్ అయింది.

- Advertisement -
Santhosh Narayana In Kalki 2898 Ad Movie
Santhosh Narayana In Kalki 2898 Ad Movie

కాగా సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు మ్యూజిక్‌ అందించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఈ సినిమా నడిచింది. అంతటా ఈ సినిమాకు ఊహించిన దానికంటే ఎక్కువగానే స్పందన వచ్చింది. దీంతో ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి.

ఇక ఏకంగా రెండు రోజుల్లోనే రూ. 260 కోట్లు కొల్లగొట్టేసింది. ఇక మరీ ముఖ్యంగా హిందీలో అయితే ఈ చిత్రం అద్భుతమైన స్పందనను అందుకుంటుంది. హిందీలో మొదటి రోజే అక్కడ ఈ సినిమా ఏకంగా రూ. 22.50 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో బాలీవుడ్ లో నాలుగుసార్లు రూ. 20 కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా ప్రభాస్ సినిమా నిలిచింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు