Sarfira Controversy : సూర్య సినిమాకు అడ్డుపడుతున్న నిర్మాత… అల వైకుంఠపురంలో సీన్ రిపీట్

Sarfira Controversy : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బ్లాక్ బస్టర్ మూవీ ఆకాశమే నీ హద్దురా హిందీలో సర్ఫిరా పేరుతో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. తమిళంలో ఈ సినిమాకు దర్శకత్వం వహించిన లేడీ డైరెక్టర్ సుధా కొంగర హిందీ రీమేక్ కు కూడా దర్శకురాలిగా బాధ్యతలు చేపట్టింది. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సూర్య, జ్యోతిక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జూలై 12న రిలీజ్ కాబోతున్న సర్ఫిరా సినిమాకు ఓ నిర్మాతకావాలనే  అడ్డుపడుతున్నాడు. సూర్యకు నష్టం వచ్చేలా ఓ దారుణమైన స్ట్రాటజీతో మేకర్స్ ను టెన్షన్ పెట్టే పని చేస్తున్నాడు.

సూర్యను టెన్షన్ పెడుతున్న నిర్మాత

సర్ఫిరా మూవీ జూలై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒరిజినల్ వెర్షన్ తమిళంలో తెరకెక్కగా, ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో డబ్ అయ్యి, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అసలు సూరారై పొట్రు హిందీ రీమేక్ చేయడంలో అర్థం ఏంటో ప్రేక్షకులకు అస్సలు అతుచిక్కడం లేదు. పైగా ఈ మూవీతో ఏకంగా ఇండియన్ 2ను బాక్స్ ఆఫీసు వద్ద ఢీ కొట్టే ధైర్యం చేస్తున్నారు అక్షయ్ కుమార్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ రిలీజ్ కాగా, అచ్చం సూరారై పొట్రును దించేశారు అనే టాక్ నడిచింది. ఇలా సర్ఫిరాను ఇన్ని కష్టాలు చుట్టుముట్టగా తాజాగా ఓ నిర్మాత అదనపు భారంగా మారాడు. సూర్యను ఈ మూవీ విషయంలో టెన్షన్ పెడుతున్నాడు.

Akshay Kumar Sarfira

- Advertisement -

గోల్డ్ మైన్ టెలీ ఫిలిమ్స్ అనే యూట్యూబ్ ఛానల్ లో సూరారై పొట్రు హిందీ డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. మనీష్ షా అనే నిర్మాత ఇప్పటికే సూరారై పొట్రు సినిమాకు సంబంధించిన రైట్స్ దక్కించుకోగా, సర్ఫిరా మూవీ థియేటర్లలోకి రానున్న రోజు అంటే జూలై 12న హిందీ డబ్బింగ్ వెర్షన్ ను రిలీజ్ చేయనున్నారు. అక్షయ్ కుమార్ మూవీ థియేటర్లలో రిలీజ్ అవుతుంటే, ఇతను అదే రోజు యూట్యూబ్ లో ఒరిజినల్ వెర్షన్ ను హిందీ డబ్ చేసి మరీ రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించి నిర్మాతలకు షాక్ ఇచ్చాడు. ఇది కచ్చితంగా సర్ఫిరా బిజినెస్ ను దెబ్బతీసే ప్లాన్ అని చెప్పొచ్చు.

అల వైకుంఠపురంలో సీన్ రిపీట్…

అల్లు అర్జున్ ఇండస్ట్రీ హిట్ అల వైకుంఠపురంలో సినిమా విషయంలో కూడా మనీష్ షా ఇలాగే ప్రవర్తించాడు. షెహజాద పేరుతో హిందీ రిలీజ్ కు రెడీ అయిన అల వైకుంఠపురంలో రీమేక్ థియేటర్లలోకి వచ్చే సమయంలోనే, సినిమాను యూట్యూబ్లో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. దీంతో షెహజాద మేకర్స్ అతనికి కొన్ని కోట్లు చెల్లించి యూట్యూబ్లో అసలు వెర్షన్ ను రిలీజ్ చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. దీంతో అప్పట్లో మనిష్ షా వెనక్కి తగ్గాడు. ఖైదీ హిందీ రీమేక్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. మరి సర్ఫిరా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు