Kalki2898AD : కల్కి జోరుకు బ్రేక్ వేస్తున్న సర్ఫిరా.. ఇక బాలీవుడ్ లో కష్టమేనా?

Kalki2898AD : ప్రభాస్ నటించిన కల్కి2898AD సినిమా థియేటర్లలో అదరగొడుతుంది. విడుదలై రెండు వారాలకు చేరువ అవుతున్నా, థియేటర్లలో ఇప్పటికి అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేస్తుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ యానానిమస్ గా అన్నిభాషల్లో కూడా మంచి టాక్ తెచ్చుకోవడంతో థియేటర్లలో అదరగొడుతుంది. ఇక ప్రభాస్ తో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ తారాగణం ఉండడంతో థియేటర్ల వద్ద అదిరిపోయే కలెక్షన్లు వసూలు చేస్తుంది. ఇక బాలీవుడ్ లో యావరేజ్ ఓపెనింగ్స్ తెచ్చుకున్నా, యానానిమస్ టాక్ తో మంచి గ్రోత్ చూపించడమే కాకుండా, హిందీ సినిమాలకు ధీటుగా కలెక్షన్లు రాబడుతుంది. అయితే ఈ కలెక్షన్ల జోరుకు ఇప్పుడు అడ్డుకట్ట పడనున్నట్టు తెలుస్తుంది.

Sarfira movie in competition with Kalki2898AD

కల్కికి అడ్డుపడుతున్న సర్ఫిరా..

ప్రభాస్ కల్కి (Kalki2898AD) సినిమా బాలీవుడ్ లో కూడా అదిరిపోయే కలెక్షన్లు వసూలు చేస్తుండగా, ఇప్పటికే 220 కోట్ల కలెక్షన్లు దాటేసి, హృతిక్ రోషన్ ఫైటర్ కలెక్షన్లను బ్రేక్ చేసి, ఈ ఇయర్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ రికార్డులు బ్రేక్ చేసే దిశగా వెళ్తున్న కల్కి కి బాలీవుడ్ మూవీ సర్ఫిరా అడ్డు తగులుతుంది. కల్కి అన్ని చోట్ల బాగానే కలెక్షన్లు రాబడుతున్నా, హిందీ, తెలుగు వెర్షన్ లలో RRR రికార్డులకు చాలా దూరంగానే ఉంది. మెల్లి మెల్లిగా ఆర్ఆర్ఆర్ హిందీ కలెక్షన్స్ ని బ్రేక్ చేసే దిశగా వెళ్తుంది. RRR మూవీ టోటల్ గా హిందీ వెర్షన్ 276.80Cr కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా కల్కి ఈ కలెక్షన్స్ ని అందుకోవాలి అంటే ఇంకా 53 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సి.

- Advertisement -

కల్కి జోరు ఆగినట్టేనా?

అయితే కల్కి కలెక్షన్లకు బాలీవుడ్ మూవీ సర్ఫిరా అడ్డు పడుతుంది. ఈ వారం జులై 12న మంచి అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ సర్ఫిరా ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కడం వల్ల, హిందీలో కూడా ఒరిజినల్ డైరెక్టరే డైరెక్ట్ చేస్తూ ఉండటంతో ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. అలాగే మరోవైపు కమల్ హాసన్ ఇండియన్2 హిందీ లో కూడా హిందుస్తానీ2 పేరుతో విడుదల కానుంది. అందువల్ల హిందీ కలెక్షన్ల పరంగా కల్కి రికార్డులకు ఈ సినిమాలు అడ్డుపడుతున్నాయని చెప్పొచ్చు. మరో 53 కోట్లు అందుకుంటే హిందీలో RRR ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఈ సినిమాలని తట్టుకుని కల్కి ఎంతవరకు నిలబడుతుంది అనేది చూడాలి. ఒకవేళ సర్ఫిరా, హిందుస్తానీ2 సినిమాలను తట్టుకుని RRR ని కల్కి బ్రేక్ చేస్తే అది భారీ రికార్డ్ అవుతుందని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు