Saripoda Sanivaram OTT : సరిపోదా శనివారం ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Saripoda Sanivaram OTT : న్యాచురల్ స్టార్ నాని (Nani) హాయ్ నాన్న సినిమాతో ఈ ఏడాది సాలిడ్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన సరిపోదా శనివారం మూవీ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా ఈరోజే రిలీజ్ అయ్యింది. అప్పుడే ఓటీటీ అప్డేట్ కూడా వచ్చేసినట్లు తెలుస్తుంది. ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

సరిపోదా శనివారం పాన్ ఇండియా స్థాయిలో ఈరోజు విడుదలైంది . తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గురువారం రిలీజ్ కానుంది. అయితే, ఈపాటికే ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పడిపోయాయి. అవి చూసిన నెటిజన్స్ సరిపోదా శనివారంపై రివ్యూలు ఇస్తున్నారు.. ఇక హీరో ఎంట్రీతోపాటు ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయని, గూస్ బంప్స్ తెప్పించాయని నెటిజన్స్ చెబుతున్నారు. అలాగే రేసీ స్క్రీన్ ప్లే, హై ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలతో ఎండింగ్ వరకు థ్రిల్లింగ్‌గా ఆకట్టుకునేలా ఉన్నాయని ఆడియన్స్ చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ మూవీ పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఇక నెలలోపే ఓటీటీ లోకి రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Saripoda Sanivaram OTT release date lock.. When is the streaming?
Saripoda Sanivaram OTT release date lock.. When is the streaming?

ఈ మూవీ ఓటీటీ అప్డేట్స్ జనాల్లో ఆసక్తిని కలిగిస్తుంది. నెలలోపే స్ట్రీమింగ్ కు రాబోతుందని టాక్. సెప్టెంబర్ నెలలో ఓటీటీ రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. సరిపోదా శనివారం ఓటీటీలో సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుందట. ఈ డేట్ నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో సరిపోదా శనివారం ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని పక్కా సమాచారం. అయితే, సరిపోదా శనివారం హిందీ వెర్షన్ మాత్రం మరో ఓటీటీ జియో సినిమాలో స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు టాక్.. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఇక కలెక్షన్స్ ఎంత రాబడుతుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు