Saripodasanivaram : ‘సరిపోదా శనివారం’ నుంచి సెకండ్ లుక్.. ఏమున్నాడుర్రా బాబు నాని..

Saripodasanivaram : న్యాచురల్ స్టార్ నాని ఎంపిక చేసుకుంటున్న కథలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి.. ఇటీవల బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. రీసెంట్ గా హయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ ను అందుకున్నాడు.. ప్రస్తుతం ‘ సరిపోదా శనివారం ‘ సినిమాలో నటిస్తున్నాడు.. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు.. న్యాచురల్ లుక్ నాని భలే ఉన్నాడు… ప్రస్తుతం ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది..

ఇకపోతే నాని 31గా వస్తోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే మేకర్స్‌ షేర్ చేసిన ఫస్ట్ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. మరోవైపు సూర్య మ్యాడ్‌నెస్ కౌంట్‌ డౌన్‌ షురూ.. అంటూ ఫస్ట్‌ సింగిల్‌ గరం గరం సాంగ్ ను రిలీజ్ చేశారు.. దానికి జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. తాజాగా సెకండ్‌ లుక్‌ను విడుదల చేశారు.. ఆ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతుంది.. ఆ పోస్టర్ లో నాని హ్యాండ్ బ్యాగ్‌ వేసుకొని సరదాగా చిల్‌ అవుట్‌ మూడ్‌లో బైకుపై వెళ్తున్న లుక్‌ నెట్టింట వైరల్ అవుతోంది.

saripoda sanivaram second look poster released
saripoda sanivaram second look poster released

గతంలో ఇలాంటి లుక్ ను ఎంసీఏ లో చూసినట్లు ఉంటుంది.. దాంతో దీనిపై నాని ఫ్యాన్స్ లో ఒక టెన్షన్ మొదలైంది.. ఈ చిత్రంలో ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.. గ్యాంగ్స్ లీడర్ తర్వాత నాని ఆ హీరోయిన్ తో కలిసి రెండోసారి నటిస్తున్నాడు.. ఈ సినిమాలో ఎస్జే సూర్య ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.. ఇక యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తుండగా.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిస్తోంది. సరిపోదా శనివారం పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల చెయ్యనున్నారు.. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండటంతో సినిమా పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు