Saripodha saninvaram : పాపం నానికి ఈ స్ట్రగుల్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు

Saripodha saninvaram : ప్రస్తుతం ఉన్న హీరోస్ లో న్యాచురల్ స్టార్ నాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. జెర్సీ సినిమా తర్వాత నాని ఎంచుకున్న ప్రతి కథను కూడా ప్రేక్షకుడు విపరీతంగా ఇష్టపడుతున్నాడు. ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా ఒక్కో సినిమాకి ఒక్కో లుక్ మైంటైన్ చేస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. జెర్సీ సినిమా తర్వాత నాని చేసిన ప్రతి సినిమా కూడా ఆడియో కి ఎక్కడో కనెక్ట్ అవుతుంది అని చెప్పాలి. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన అంటే సుందరానికి అనే సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు. కానీ చాలామందికి ఈ సినిమా పర్సనల్ గా చాలా ఇష్టమని చెప్పాలి. ఈ సినిమాకి సపరేట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు.

మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన వివేక్ ఆత్రేయ చేసిన మూడు సినిమాలుతో మంచి పేరును సాధించుకున్నాడు. ఇప్పుడు వివేక్ సరిపోదా శనివారం అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ సినిమాపై మంచి అంచనాలను పెంచుతుంది. ఈ సినిమాతో ఎలాగైనా కమర్షియల్ హిట్ సాధించాలి అని ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్. రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ కూడా సినిమాకి మంచి ప్లస్ అవుతుంది. ఈ సినిమాను ఆగస్టు 29న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Actor Nani

- Advertisement -

ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించినప్పుడు ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ ఊహించని విధంగా ఈ సినిమాకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రీసెంట్ టైమ్స్ లో ఇబ్బంది అంటే ఆ సినిమాతో మరో సినిమా పోటీ ఉండటం. అనుకున్నట్లు సినిమా రాకపోవడం వలన దాన్ని పోస్ట్పోన్ చేయడం ఇలా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ సినిమాకి రీ రిలీజ్ సినిమాలు థ్రెడ్ గా మారాయి. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర సినిమాను ఆగస్టు 22న రిలీజ్ చేస్తున్నారు, నాగార్జున పుట్టినరోజు సందర్భంగా శివ సినిమాను 29 అని రిలీజ్ చేస్తున్నారు. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్న తరుణంలో నాని అదే డేట్ కి వస్తాడా లేకుంటే డేట్ మారుస్తాడా అనేది త్వరలో తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు