Saripodha Sanivaram: నువ్వు చెప్పినట్టే చేసా, ఇప్పుడు మాట మీద నిలబడు – నాని

Saripodha Sanivaram: నాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ(Vivek Athreya) దర్శకత్వంలో చేస్తున్న సినిమా సరిపోదా శనివారం. సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇదివరకే వీరి కాంబినేషన్లో అంటే సుందరానికి(Ante Sundaraniki) అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. కంప్లీట్ క్లాస్ సినిమాకు వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని ప్లాట్ ను మూటగట్టుకుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇష్టపడిన వాళ్లు కూడా ఉన్నారు అని చెప్పాలి. చాలామందికి ఇప్పటికి ఒక ఫేవరెట్ ఫిలిం అంటే సుందరానికి.

ఇకపోతే ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ కాకపోవడం వలన ఈసారి పక్కా యాక్షన్ ఫిలిం చేయాలని డిసైడ్ అయినట్టున్నారు వీరిద్దరూ. అందుకే ఈ సినిమాని ఒక మాస్ యాక్షన్ డ్రామాగా డిజైన్ చేశాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ కూడా సినిమా మీద మంచి అంచనాలను పెంచుతుంది. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్(Priyanka Arul Mohan), ఎస్ జే సూర్య(SJ Surya) కీలకపాత్రలో కనిపిస్తున్నారు. సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ రిలీజ్ అయిన కంటెంట్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.

Saripodha Sanivaram

- Advertisement -

సరిపోదా శనివారం సినిమా నేడు రిలీజ్ అవుతున్న తరుణంలో నాని(Nani) ట్విట్టర్ వేదికగా ఆస్క్ నాని అంటూ ఒక చిట్ చాట్ ను మొదలుపెట్టాడు. దీంట్లో చాలామంది చాలా రకాలుగా ఉన్న డౌట్స్ ఎక్స్ ప్రెస్ చేసి నానిని క్వశ్చన్స్ వేసారు మాక్సిమం అన్నిటికి సమాధానం ఇచ్చాడు నాని. అయితే ఒక నాని అభిమాని నీ గురించి ఇప్పటివరకు ఫ్యాన్ వార్స్ చేసాను. ఇప్పుడు నాకు రిప్లై ఇస్తే నా స్టడీస్ మీద ఫోకస్ చేస్తాను అంటూ ఒక ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్ కి నాని స్పందిస్తూ రిప్లై ఇచ్చాను నువ్వు చెప్పినట్లు మాట మీద నిలబడు అంటూ నాని రెస్పాండ్ అయ్యాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు