Saripodha Sanivaram: చిన్నగా మిడిల్ క్లాస్ అబ్బాయిల అనిపిస్తుంది

Saripodha Sanivaram: నాచురల్ స్టార్ నాని గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్లాప్ అసిస్టెంట్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత బాపు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన అష్టా చమ్మా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాతోనే మంచి గుర్తింపు సాధించుకొని ఆ తర్వాత హీరోగా కూడా వరుస సినిమాలు చేశాడు. అయితే నాని తన కెరీర్లు ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్ బేస్ సినిమాలు ఎంచుకొని నేడు ఈ స్థాయికి వచ్చాడు. ప్రస్తుతం నాని నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే ప్రేక్షకులంతా ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తారు.

ఇక నాని ఫిల్మోగ్రఫీ విషయానికి వస్తే జెర్సీ సినిమా తర్వాత నాని ఎంచుకున్న ప్రతి కాన్సెప్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది. నాని చేసిన కొన్ని సినిమాలకు అద్భుతమైన కలెక్షన్స్ రాకపోయినా కూడా ఒక మంచి సినిమాను ఎంచుకున్నాడు అని మాత్రం అనిపించుకున్నాడు. గత రాష్ట్ర ప్రభుత్వం నానిపైన పర్సనల్గా కక్ష సాధింపు చర్యలు చేపట్టడం వలన సినిమా హిట్ టాక్ సాధించిన కూడా సరైన కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కానీ నాని మార్కెట్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. అన్ని అద్భుతమైన సినిమాలను చేశాడు నాని.

లేకపోతే ఓ మై ఫ్రెండ్ అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం వేణు శ్రీరామ్. ఆ సినిమా ఊహించని విజయాన్ని సాధించుకోలేకపోయింది. ఆ తర్వాత నానితో మిడిల్ క్లాస్ అబ్బాయి అనే సినిమాని తీశాడు. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ సాధించిన కూడా పెద్దగా పేరు అయితే రాలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన వకీల్ సాబ్ సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు వేణు శ్రీరామ్. ఇక మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా విషయానికి వస్తే ఆ సినిమాలో నాని లుక్స్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తాయి.

- Advertisement -

Saripodhaa Sanivaaram

ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇదివరకే వీరి కాంబినేషన్లో వచ్చిన అంటే సుందరానికి సినిమా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేకపోయింది. కానీ ఎంతమంది ప్రశంసలు అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమాకి ఒక సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పొచ్చు. ఇక సరిపోదా శనివారం సినిమాకి సంబంధించి రీసెంట్గా ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇంక ఈ పాటలో నానిని చూస్తూ ఉంటే మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో నాని ఎలా కనిపించాడు అలానే కనిపిస్తున్నాడు. ఇదే విషయంపై చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు