Saripodha Sanivaram: సీక్వెల్ కి స్కోప్ ఉంది, కానీ ఇదంతా రిజల్ట్ పై డిపెండ్ అయింది

Saripodha Sanivaram: ప్రస్తుత కాలంలో సీక్వెల్ కి ఎక్కువగా స్కోప్ ఉండే సినిమాలు వస్తున్నాయి. రీసెంట్ టైమ్స్ లో చాలా సినిమాలు సీక్వెల్ కూడా రెడీ అవుతున్నాయి. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సీక్వెల్ గా చేసిన సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. మొదటి సినిమా మీద ఉన్న హై ఎక్ష్పెక్టేషన్స్ సీక్వెల్ అందుకోలేకపోతే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగులుతుంది. సూపర్ హిట్ సినిమాలుకి సీక్వెల్ గా చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. అలానే హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

రీసెంట్ గా డీజే టిల్లు(Dj Tillu) అనే సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda). ఆ సినిమా సిద్దు ని స్టార్ ను చేసింది. వెంటనే అదే సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమాను చేశాడు సిద్దు. బాక్స్ ఆఫీస్ వద్ద టిల్లు సినిమా ఎటువంటి అంచనాలను క్రియేట్ చేసిందో అంతకు మించిన అంచనాలను ఈ సినిమా క్రియేట్ చేసింది. ఇప్పుడు టిల్లు క్యూబ్ సినిమాను సిద్ధం చేస్తున్నారు. అయితే టిల్లు సినిమాని అందుకోవడానికి టిల్లు స్క్వేర్(Tillu Square) ని చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి బెస్ట్ రైటింగ్ తో రాసి పర్ఫెక్ట్ టైంలో రిలీజ్ చేశారు. ఈ సినిమాతో 100 కోట్లు మార్కెట్లోకి చేరిపోయాడు సిద్దు.

Saripodhaa Sanivaaram

- Advertisement -

ఇక ప్రస్తుతం నాని నటిస్తున్న సరిపోదా శనివారం(Saripodha Sanivaram) సినిమా కూడా సీక్వెల్ ఉండే అవకాశం ఉంటుంది అని సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాలో సోకులపాలెం అనే ఒక విలేజ్ ని క్రియేట్ చేశారు. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమా ఫలితాన్ని బట్టి సినిమా సీక్వెల్ ఉండబోతుంది అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా హిట్ అయితే వివేక్ లోని ఉన్న ఒక క్లాస్ డైరెక్టర్ ను మిస్ అయిపోతాం అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు