Saripodha Sanivaram: భలే మాస్టర్ ప్లాన్ వేసావ్ గా వివేక్

Saripodha Sanivaram: మెంటల్ మదిలో(Mental Madhilo) సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు వివేక్ ఆత్రేయ. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ హిట్గా నిలిచింది. ఈ సినిమా తర్వాత చేసిన బ్రోచేవారెవరురా(Brochevarevarura) సినిమా కూడా మంచి పేరును సాధించింది. ఇకపోతే నాని హీరోగా అంటే సుందరానికి(Ante Sundaraniki) అనే సినిమాను తెరకెక్కించాడు వివేక్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా డిజాస్టర్ అయిన కూడా ఇప్పటికీ ఈ సినిమాకి ఒక కల్ట్ స్టేటస్ ఉంది. కానీ ఈ సినిమాకి సంబంధించి వివేక్ ఆత్రేయ రాసిన స్క్రీన్ ప్లే చాలామందికి బాగా కనెక్ట్ అయింది.

ఇక ప్రస్తుతం సరిపోదా శనివారం(Saripodha Sanivaram) అనే సినిమాను చేస్తున్నాడు వివేక్. ఈ సినిమాను విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడు నాని. ఈ సినిమాకి సంబంధించి ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉంది చిత్ర యూనిట్. ఇకపోతే రీసెంట్ గా నాని మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది అని చెబుతూ వచ్చాడు. ఇక వివేక్ ఆత్రేయ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివేక్(Vivek Athreya) సంబంధించి తన రైటింగ్ పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. వివేక్ సినిమాలో స్క్రీన్ ప్లే ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి సంబంధించి స్క్రీన్ ప్లే ఏ సెంటర్లో అద్భుతంగా వర్కౌట్ అవుతుంది.

Saripodha Sanivaram

- Advertisement -

ఈ సినిమా కంప్లీట్ గా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది అని ఇదివరకే రిలీజ్ అయిన కంటెంట్ చూసి చెప్పొచ్చు. ఇప్పటివరకు సాఫ్ట్ సినిమాలు తీసే వివేక్ ఆత్రేయ ఈ సినిమాతో స్ట్రాంగ్ కమర్షియల్ ఫిలింని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందిస్తున్నాడు. ఇక ఈ కమర్షియల్ అంశాలన్నీ కూడా ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ కానున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి జెక్స్ బీజోయ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్ద ప్లస్ కానుంది. ఇప్పటివరకు క్లాస్ సినిమాలు తీసిన వివేక్ కెరియర్ లో ఫస్ట్ టైం యాక్షన్ మూవీను ఎలా డీల్ చేశాడు అని చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్టోరీని కూడా కొంత మేరకు రీవీల్ చేశారు. ఇక అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేసి మంచి ప్లాన్ వేశాడు దర్శకుడు వివేక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు