Saripodhaa Sanivaaram : ఎవరూ టచ్ చేయని రికార్డ్.. నాని పదోసారి కొట్టేశాడు..

Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “సరిపోదా శనివారం” సినిమా ఆగష్టు 29న థియేటర్లలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ (Vivek Atreya) – నాని కాంబోలో ‘అంటే సుందరానికి’ తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా, పాయింట్ తో కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన “సరిపోదా శనివారం” ప్రీమియర్స్ నుండే పాజిటివ్ రెస్పాన్స్ తో దుమ్ము లేపింది. మరీ యనానిమస్ రేంజ్ లో కాకపోయినా, ప్రేక్షకులు మెచ్చేలానే సినిమా ఉండడంతో చాలా రోజుల తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టారు. ఇదిలా ఉండగా నానికి ఓవర్సీస్ లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుందని తెలిసిందే. అక్కడ టాప్ హీరోల రేంజ్ లో నాని సినిమాలకు వసూళ్లు వస్తుంటాయి. తాజాగా సరిపోదా శనివారం సినిమాతో నాని పరాయిగడ్డపై మరోసారి దుమ్ములేపుతున్నాడు.

Saripodhaa Sanivaaram crossed the one million dollar mark overseas

ఏకంగా పదోసారి..

ఇక నాని (Nani) సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ కంటెంట్ ని బట్టి వస్తాయి కానీ, ఓవర్సీస్ లో సినిమాతో సంబంధం లేకుండా మినిమం ఓపెనింగ్స్ వస్తాయి. ఇప్పుడు సరిపోదా శనివారం కూడా ఓవర్సీస్ లో భారీ ఓపెనింగ్స్ తో కుమ్మేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన ఓపెనింగ్స్ రాకపోయినా, ఓవర్సీస్ పై భారీ వసూళ్లు రాబట్టింది. తాజాగా సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) ఏకంగా 1 మిలియన్ డాలర్ కొట్టేసింది. రిలీజ్ అయిన రెండు రోజులకే ఈ ఫీట్ సాధించడం విశేషం. ఇక నాని కెరీర్ లో వన్ మిలియన్ డాలర్లు వసూలు చేసిన సినిమాల్లో సరిపోదా శనివారం ఏకంగా పదో సినిమా కావడం విశేషం. ఈగ నుండి మొదలుకొని, ఇప్పటివరకు వచ్చిన సినిమాలతో కలిపి ఇప్పుడు ఈ సినిమాతో పదో సారి వన్ మిలియన్ డాలర్ రికార్డ్ కొట్టడం విశేషం.

- Advertisement -

టచ్ చేయలేని రికార్డ్..

ఇక ఓవర్సీస్ లో నాని క్రియేట్ చేసిన రికార్డ్ ఎవరూ టచ్ చేయని రేంజ్ లో ఉందని చెప్పాలి. అయితే ఓవర్సీస్ లో అత్యధిక వన్ మిలియన్ డాలర్స్ ఉన్న స్టార్స్ లో ఒక్క సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) మాత్రమే టాప్ లో ఉన్నాడు. మహేష్ నటించిన 11 సినిమాలు అక్కడ మిలియన్ డాలర్ మార్క్ ని అందుకోగా, ఇప్పుడు రెండో స్థానంలో 10 సినిమాలతో నాని నిలిచాడు. త్వరలో మహేష్ రికార్డ్ ని కూడా బ్రేక్ చెసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మహేష్ – జక్కన్న సినిమాకు మరో రెండేళ్లు పట్టినా, ఈ లోపు నాని ఇంకో రెండు సినిమాలతో వచ్చేస్తాడు. దాంతో మహేష్ ని ఈజీగా దాటేయొచ్చు. ఇక ఇతర స్టార్ హీరోలు ఏడేసి సినిమాలతో దూరంగానే ఉన్నారు. ఇక సరిపోదా శనివారం రెండు రోజుల్లో 35 కోట్ల వసూళ్లు సమాచారం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు