SaripodaaSanivaaram : నాని సినిమాకి ‘డబుల్ ఇస్మార్ట్’ కన్నా తక్కువ ఎందుకు? తప్పెక్కడ జరిగింది?

SaripodhaaSanivaaram : నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “సరిపోదా శనివారం” సినిమా ఆగష్టు 29న థియేటర్లలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. శనివారం మాత్రమే కోపం చూపిస్తాడు అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ “సరిపోదా శనివారం” ప్రీమియర్స్ నుండే పాజిటివ్ రెస్పాన్స్ తో దుమ్ము లేపింది. మరీ యనానిమస్ రేంజ్ లో కాకపోయినా, ప్రేక్షకులు మెచ్చేలానే సినిమా ఉండడంతో చాలా రోజుల తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టారు. కల్కి తర్వాత రెండు మూడు చిన్న సినిమాలు మినహా ఏ సినిమా ఆకట్టుకోకపోవడంతో సరిపోదా శనివారం సినిమాకి ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక నాని ఫ్యాన్స్ కి అయితే డైరెక్టర్ ఫుల్ మీల్స్ పెట్టేసాడని చెప్పాలి.

 Saripodhaa Sanivaaram has less openings than Double Smart

తెలుగు రాష్ట్రాల్లో దెబ్బేసిన ఓపెనింగ్స్..

ఇక సరిపోదా శనివారం సినిమాకి వరల్డ్ వైడ్ గా ఓపెనింగ్స్ బాగానే ఉన్నా, ఆశించినంత మాత్రం రాలేదని చెప్పాలి. ఒక్క ఓవర్సీస్ లోనే సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పాలి. అక్కడ ప్రీమియర్స్ తో కలిపి ఫస్ట్ డే 4 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఓపెనింగ్ డే దెబ్బేసిందని చెప్పాలి. ఇక్కడ కేవలం మొదటి రోజు 5.88 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. అయితే నాని లాంటి హీరో సినిమాకి డి మంచి ఓపెనింగ్స్ అయినా, సరిపోదా శనివారం సినిమాకి ఉన్న హైప్ కి ఇవి చాలా తక్కువే అని చెప్పాలి.

- Advertisement -

డబుల్ ఇస్మార్ట్ కన్నా తక్కువ.. తప్పెక్కడ జరిగింది..

అయితే సరిపోదా శనివారం సినిమాకి రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ (Double ismart) కన్నా తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పాలి. డబుల్ ఇస్మార్ట్ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 6.10 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. అది కూడా పోటిలో మిస్టర్ బచ్చన్ పోటీగా ఉండి వచ్చాయి. కానీ సరిపోదా శనివారం వీకెండ్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా మొదటి రోజు 5.88 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది. తప్పెక్కడ జరిగిందని లెక్కేస్తే నాని సినిమాకి ఎలాంటి హాలిడే సీజన్ లేదు. అలాగే ఈ సినిమా రిలీజ్ రోజు తెలుగు రాష్ట్రల్లో పలు చోట్ల భారీ వర్షాలు ప్రభావం చూపించాయి. అన్నిటికి మించి ఈ సినిమా దసరా రేంజ్ లో మాస్ సినిమా కాదు కాబట్టి, దీనికి వసూళ్లు కాస్త తగ్గాయి. కానీ రెండో రోజు లో స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తుందని చెప్పాలి. అన్ని బాగుంటే తొలివారమే సరిపోదా శనివారం బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు