Saripodhaa Sanivaaram : శనివారం కథ ఏంటో తెలిసిపోయింది… కానీ ఇది నానికి సరిపోతుందా…?

Saripodhaa Sanivaaram.. నాచురల్ స్టార్ నాని ఒకవైపు నిర్మాతగా, మరొకవైపు హీరోగా దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే తాజాగా నటిస్తున్న చిత్రం సరిపోదా శనివారం. చివరిగా హాయ్ నాన్న సినిమాతో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన ఈ సినిమాతో ఏకంగా ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు ని కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా సరిపోదా శనివారం అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన చిత్రం ఇది . ఇందులో నాని హీరోగా నటిస్తుండగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా , ఎస్. జె.సూర్య కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం తెలుగు, తమిళ్ ,హిందీ ,మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతోంది.

Saripodhaa Sanivaaram : I know what Saturday's story is... but is this good enough for me...?
Saripodhaa Sanivaaram : I know what Saturday’s story is… but is this good enough for me…?

సరిపోదా శనివారం స్టోరీ లీక్..

అయితే ప్రస్తుతం సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం అప్పుడే ప్రమోషన్స్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఎస్ జె సూర్య ఇందులో పోలీసు ఆఫీసర్గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈయన సరిపోదా శనివారం స్టోరీ రివీల్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.

నాని శనివారం బాషా..

సూర్య క్యారెక్టర్ లో హీరో నాని నటిస్తున్నారు. ఇదే విషయాన్ని ఎస్ జె సూర్య మాట్లాడుతూ.. సూర్య (నాని ) చిన్నప్పటి నుంచి కొంచెం ఆవేశం, కోపం ఎక్కువగా కలిగి ఉంటాడు. అలాంటి నేచర్ తోనే పెరుగుతూ వస్తాడు. అయితే ఇలాగే కొనసాగితే పెద్ద అయితే ఎన్నో సమస్యలు ఎదురవుతాయని వాళ్ళ అమ్మ బాధపడుతుంది. ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలని ఆలోచిస్తుంది. ఇలా చేయకూడదు అని చెబితే చిన్నపిల్లలు ఇంకా ఎక్కువ అలాగే చేస్తారని ఆలోచించిన ఆమె.. ఒక ఆలోచన చేసి సూర్య తో నీ కోపం చూపించు కానీ అన్ని రోజులు వద్దు కేవలం ఒక్కరోజు మాత్రమే నీ కోపం చూపించు అంటూ చెబుతుంది. అలా ఒక రీసన్ కోసం తన కోపం చూపించడానికి శనివారం ఎంచుకుంటాడు సూర్య . అమ్మకిచ్చిన మాట వల్ల ఆదివారం నుంచి శుక్రవారం వరకు సూర్య బాషా సినిమాలో మాణిక్యం లాగా ప్రవర్తిస్తాడు. శనివారం మాత్రం బాషా లాగా ప్రవర్తిస్తాడు. అలా సూర్య ఈ సినిమాలో శనివారం బాషా అన్నమాట అంటూ ఎస్ జె సూర్య చెప్పుకొచ్చారు. మొత్తానికైతే స్టోరీ లైన్ మొత్తం రివీల్ చేసేసారు.

- Advertisement -

షాక్ లో ఫ్యాన్స్..

ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి సార్ నవ్వుతూనే స్టోరీ మొత్తం చెప్పేసారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే టీజర్ చూసిన వారికి స్టోరీ పై క్లారిటీ వచ్చింది. ఇప్పుడు సూర్య మొత్తం రివీల్ చేసేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి కథలు నాని కి సెట్ అవుతాయా లేదా అనే డైలమా లో పడ్డారు ఫ్యాన్స్. ఇక స్టోరీ మొత్తం తెలిసిపోయింది థియేటర్లకు ఏం వెళ్దాం అనుకునే అభిమానులు కూడా లేకపోలేదు. మొత్తానికైతే స్టోరీ లీక్ చేశారు. మరి నాని సరిపోదా శనివారం సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు