Saripodhaa Sanivaaram : సరిపోదా శనివారం బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్.. దసరా కన్నా తక్కువే!

Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం సినిమా ఫైనల్ గా రేపు ఆగష్టు 29న థియేటర్లలో రిలీజ్ అయిపోతుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలుండగా, టీజర్, ట్రైలర్ సహా చిత్ర యూనిట్ తమ ప్రమోషన్లతో సినిమాపై భారీగా అంచనాలను పెంచేశారు. కల్కి తర్వాత వచ్చిన మినిమం అంచనాలతో వచ్చిన క్రేజీ సినిమాలన్నీ ప్లాప్ కావడంతో ఇప్పుడు మూవీ లవర్స్ ఎంతో ఆతృతతో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక నాని లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న సినిమాతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న నాని ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఇక సరిపోదా శనివారం సినిమా బిజినెస్ పరంగా గట్టిగానే చేసిందని చెప్పాలి.

Saripodhaa Sanivaaram Movie Business & Break Even Target

సరిపోదా శనివారం ఏరియా వైస్ బిజినెస్ గమనిస్తే..

ఇక నాని (Nani) నటించిన సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ నమోదు చేసింది. అయితే పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఆశించినంత చేయకపోయినా, ఓవరాల్ గా బిజినెస్ జరిగిందని చెప్పాలి. ఒక్కసారి ఏరియా వారీగా బిజినెస్ ని గమనిస్తే… నైజాంలో 12.50 కోట్లు, సీడెడ్ లో 5 కోట్లు, ఆంధ్ర లో 12.50 కోట్ల బిజినెస్ జరిగింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల బిజినెస్ జరగగా, కర్ణాటక, రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 5 కోట్లు, ఓవర్సీస్ లో 6 కోట్ల బిజినెస్ జరిగింది.

- Advertisement -

దసరా కన్నా సరిపోదా తక్కువే..

ఇక సరిపోదా శనివారం సినిమాకి వరల్డ్ వైడ్ గా 41 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగగా, బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా హిట్ అవ్వాలంటే 42 కోట్ల రేంజ్ లో షేర్ కావాలి. అయితే నాని దసరా సినిమా 48 కోట్ల బిజినెస్ జరగగా, దసరా (Dasara) కంటే సరిపోదా శనివారం సినిమాకి తక్కువే జరిగిందని చెప్పాలి. అయితే సరిపోదా శనివారం సినిమాకి ఇంకా బిజినెస్ ఎక్కువ జరగాల్సి ఉన్నా, నిర్మాతలే కావాలని సేఫ్ జోన్ లో తక్కువ బిజినెస్ చేసారని సమాచారం. ఇక బుకింగ్స్ లో ఇప్పటికే 5 కోట్ల మార్క్ దాటిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 15 కోట్లకి పైగా ఓపెనింగ్స్ అందుకునే ఛాన్స్ ఉంది. టాక్ బాగుంటే తొలివారమే బ్రేక్ ఈవెన్ కూడా కావచ్చు. మరి థియేటర్లో సరిపోదా శనివారం ఏ రేంజ్ రచ్చ చేస్తుందో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు