Saripodhaa Sanivaaram : బుల్లితెరపై అప్పుడే ప్రమోషన్లు షురూ…

Saripodhaa Sanivaaram : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ సినిమాల్లో ‘సరిపోదా శనివారం’ కూడా ఒకటి. నాని కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అంటే సుందరానికి తర్వాత నాని – వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై టాలీవుడ్ లో స్కై లెవెల్లో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయినా, రిలీజ్ తర్వాత క్లాసిక్ గా నిలిచింది. టాలీవుడ్ లో అండర్రేటెడ్ క్లాసిక్ సినిమాల్లో ఒకటిగా అంటే సుందరానికి నిలిచింది. ఇదిలా ఉండగా ‘స‌రిపోదా శ‌నివారం’ సినిమా షూటింగ్ కూడా ముగించుకుని, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉండగా, వ‌రుస అప్డేట్స్, ప్రమోషన్లతో చిత్ర యూనిట్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.

Saripodhaa Sanivaaram promotions started on the big screen

బుల్లితెరపైనా ప్రమోషన్లు షురూ…

ఇక సరిపోదా శనివారం సినిమాలో పాన్ ఇండియా రేంజ్ లో నటీనటులు నటించగా, ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లోనే ప్రమోట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా కోసం బుల్లితెరపై కూడా ప్రమోషన్లు స్టార్ట్ చేసారు. ఇక లేటెస్ట్ గా నాని ఈటివి 30ఇయర్స్ సెలెబ్రేషన్స్ షో లో సరిపోదా శనివారం సినిమా గురించి ప్రమోట్ చేస్తూ ప్రమోషన్లు స్టార్ట్ చేసారు. ఆ షో లో సుమ, సుధీర్ యాంకర్లుగా వ్యవహరిస్తుండగా, తాజాగా దీనికి సంబంధించిన స్టిల్స్ విడుదలయ్యాయి. ఇదే కాక ఛానల్స్ లో కూడా త్వరలోనే ప్రమోషన్లు స్టార్ట్ చేయనున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి త్వరలో సెన్సార్ కూడా వెళ్లబోతుండగా, ఓవర్సీస్ లో బుకింగ్స్ ఆగష్టు 9 నుండి ఓపెన్ అవుతాయని మేకర్స్ వెల్లడించారు.

- Advertisement -

భారీ తారాగణంతో సినిమా..

ఇక సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తుండగా, విలన్ గా ఎస్.జె. సూర్య నటిస్తున్నాడు. అలాగే అజ‌య్ ఘోష్, కాళి, మార్టిన్, ముర‌ళీశ‌ర్మ‌, అజ‌య్, అదితి బాల‌న్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్, శుభ‌లేఖ సుధాక‌ర్, సాయి కుమార్, అభిరామి నటిస్తున్నారు. జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి ఎంట‌ర్టైన్మెంట్స్ పై దాన‌య్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆగ‌స్టు 29న వ‌ర‌ల్డ్ వైడ్ గా సరిపోదా శనివారం సినిమాను పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేయ‌నున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు