Saripodhaa Sanivaaram Teaser : భయంకర నరకాసురతో నాని సరితూగే సమరమే.. ఇక సంహారం తథ్యమే…

Saripodhaa Sanivaaram Teaser :టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం అతను నటిస్తున్న మూవీ సరిపోదా శనివారం అనే సినిమాను చేస్తున్నాడు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై హైప్ ను క్రియేట్ చేస్తుంది.. ఈ టీజర్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే మంచి వ్యూస్ ను రాబట్టి ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది..

ఈ టీజర్ మొదట్లోనే జనాలు పరిగెత్తుతూ కనిపిస్తారు.. ఎస్జే. సూర్య పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న మ్యూజిక్ జనాలను భయపెడుతుంది.. పోలీస్గా ఉన్న సూర్య జనాలను కొడుతూ, హింసిస్తూ కనిపిస్తాడు.. అప్పుడే నాని, హీరోయిన్ ఎంట్రీ తో ఇస్తాడు.. అక్కడ భారీ ఫైట్ జరుగుతుందని బ్యాగ్రౌండ్ చూస్తే తెలుస్తుంది.. అప్పుడు నాని హ్యాపీ బర్త్ డే సార్ అని అంటాడు.. ఆ తర్వాత సూర్య కు హ్యాపీ బర్త్ డే అని చెబుతూ టీజర్ ను తో ఎండ్ చేశారు.. ఈ టీజర్ చూస్తుంటే భారీ ఫైట్స్ ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమాలో నాని సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు..

saripodhaa-sanivaaram-teaser-released
saripodhaa-sanivaaram-teaser-released

ఈ సినిమా నాని 31 వ సినిమాగా రాబోతుంది.. ఈ చిత్రంలో ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.. గ్యాంగ్స్ లీడర్ తర్వాత నాని ఆ హీరోయిన్ తో కలిసి రెండోసారి నటిస్తున్నాడు.. ఈ సినిమాలో ఎస్జే సూర్య ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.. ఇక యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తుండగా.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిస్తోంది. సరిపోదా శనివారం పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల చెయ్యనున్నారు.. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండటంతో సినిమా పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.. ఈ సినిమా నుంచి మరొక సాంగ్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు టాక్..

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు