Saripodhaa Sanivaram : రన్ హి ఈజ్ కమింగ్… సరిపోదా శనివారం నుంచి సాలిడ్ అప్డేట్

Saripodhaa Sanivaram : నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా అంటే సుందరానికి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. వీరిద్దరూ మరోసారి ‘సరిపోదా శనివారం’ అనే సినిమాతో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సరిపోదా శనివారం నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.

రన్.. హి ఈజ్ కమింగ్

నాని హీరోగా, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న రెండవ మూవీ సరిపోదా శనివారం. ఇందులో నాని సరసన ప్రియాంక మోహన్‌ కథానాయికగా నటిస్తోంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ బాణీలు సమకూరుస్తున్నారు. ఒకసారి అంటే సుందరానికి మూవీతో ఎదురుదెబ్బ ఎదుర్కొన్న నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండవసారి అయినా పెద్ద హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే యాక్షన్ థ్రిల్లర్ సరిపోదా శనివారంలో నాని ప్రత్యేకమైన అవతార్‌లో కన్పించి సర్ప్రైజ్ చేశాడు. కాగా సరిపోదా శనివారం నుంచి రిలీజైన ఫస్ట్ గ్లిమ్స్ భారీగా అంచనాలను నెలకొల్పింది. అంతేకాకుండా మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

Saripodhaa Sanivaaram

- Advertisement -

ఈ నేపథ్యంలోనే సరిపోదా శనివారం టీమ్ ఈ శ‌నివారం స‌మ్‌థింగ్ స్పెష‌ల్ రాబోతోంద‌ని ఓ సర్ప్రైజ్ అప్డేట్ ను రివీల్ చేసింది. ప్రొడక్షన్ హౌస్ ట్వీట్ చేస్తూ “రన్ – అతను జూలై 20న వస్తున్నాడు. రియల్ మ్యాడ్‌నెస్ ప్రారంభించడానికి సమయం ఆసన్నమైంది” అంటూ సరిపోదా శనివారం మూవీ టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు అఫిషియల్ గా వెల్లడించింది.

ఆ టీజర్ కంటెంట్ ఇదేనా?

అయితే ఇప్పటికే ఓ స్పెషల్ గ్లిమ్స్ ద్వారా నాని పాత్ర ఎలా ఉంటుందో వెల్లడించారు మేకర్స్. అందుకే టీజర్ రిలీజ్ అనగానే అందులో ఉండే కంటెంట్ ఏంటి అనే చర్చ మొదలైంది. అందులో భాగంగానే బహుముఖ నటుడు ఎస్జే సూర్య ఇందులో విలన్ గా నటిస్తుండగా, ఆయన రోల్ ను హైలైట్ చేస్తూ మేకర్స్ ఒక ప్రత్యేక గ్లిమ్స్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది. మరి ఆ టీజర్ ఎలా ఉంటుందో చూడాలంటే జూలై 20 దాకా వెయిట్ అండ్ సీ.

హీరోయిన్ మరోసారి రిపీట్

సరిపోదా శనివారం మూవీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండగా, ఆగస్టు 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మేకర్స్ ఈ సినిమాలోని రెండవ పాట ‘ఉల్లాసం’ను జూలై 13న రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ దక్కింది. అలానే మొదటి పాట గరం గరంకి కూడా మంచి ఆదరణ లభించింది. గ్యాంగ్ లీడర్ తర్వాత నాని, ప్రియాంక మోహన్ కలిసి నటిస్తున్న రెండో సినిమా సరిపోదా శనివారం కావడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు