Sarkaru Vaari Paata: మొన్న నీళ్ళ మట్టం , నిన్న పాదఘట్టం, నేడు.?

టాలీవుడ్ అంటేనే సెంటిమెంట్ కి కేరాఫ్ అడ్రెస్.
ఇక్కడ సెంటిమెంట్స్ ను చాలా బలంగా నమ్ముతారు.
కొన్ని సార్లు పూజ అయిపోయిన సినిమాలు ఆగిపోతే అదొక సెంటిమెంట్.
సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాల ముహూర్తానికి రారు అది ఆయన సెంటిమెంట్. త్రివిక్రమ్ రీసెంట్ టైమ్స్ లో చేసిన సినిమా టైటిల్స్ “అ” అక్షరంతో స్టార్ట్ అవుతాయి అదొక సెంటిమెంట్.

ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం కల్పించమని ఎప్పటినుండో తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు సీఎం జగన్ తో అనేక చర్చలు జరిపారు.
“రిపబ్లిక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ తో మొదలైన ఈ వివాదం ముదురుతూ వచ్చింది. అప్పటినుండి సినీ పరిశ్రమను టార్గెట్ చేసింది జగన్ ప్రభుత్వం.

వీటన్నిటిని పరిష్కరించడానికి మెగాస్టార్ చిరంజీవి ముందడగు వేశారు.
ఈ క్రమంలోనే తెలుగు స్టార్ హీరోస్ అయిన మహేష్ బాబు , ప్రభాస్ లను తన వెంట పట్టుకుని ఏపీ సీఎం జగన్ ను కలిసారు. ఎవరైతే ఏపీ సీఎం జగన్ ను కలిసారో వాళ్ళ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
మొన్న రాధేశ్యాం , రీసెంట్ గా రిలీజైన ఆచార్య సినిమాలు భారీ డిజాస్టర్స్ అయ్యాయి, నిన్న రిలీజైన “సర్కారు వారి పాట” సినిమాకి కూడా నెగెటివ్ టాక్ వస్తుంది, ఈ సినిమా పరిస్థితి ఏంటి అనేది రేపో , ఎల్లుండో తెలుస్తుంది. తృటిలో తప్పిన ప్రమాదం అన్నట్టు రాజమౌళి మాత్రం తప్పించుకోగలిగారు అనేది చాలామంది సినీ పేమికుల అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు