PM Modi Biopic : తెరపైకి ప్రధాన మంత్రి మోడీ బయోపిక్… బాహుబలి నటుడు న్యాయం చేస్తాడా…?

PM Modi Biopic : ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో మరోసారి కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు స్పష్టం చేశాయి. దీంతో నరేంద్ర మోడీ మరొకసారి అంటే ముచ్చటగా మూడవసారి దేశ ప్రధాని కాబోతున్నారన్నమాట. ప్రధాని నరేంద్ర మోడీ పనితీరు చూసి… గ్రామీణ ప్రజలు కూడా ఆయనకు ఓటు వేసి ఎందుకు సిద్ధమయ్యారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ అంశం తెరపైకి వచ్చింది.

ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ త్వరలోనే రాబోతుందని… తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ లో… ప్రధాని పాత్రలో సత్యరాజ్ నటించబోతున్నారని తెలుస్తోంది. ఇదే విషయం సోషల్ మీడియాలో చర్చనీఅంశంగా మారింది. అయితే ఈ బయోపిక్ కు దర్శక నిర్మాతలు ఎవరు అనేది ఇంకా ఫిక్స్ కాలేదు కానీ… ఇందులో హీరో పాత్ర మాత్రం సత్యరాజ్ అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Sathyaraj to star in Prime Minister NarendraModi's biopic
ప్రధాన మంత్రి మోడీ బయోపిక్ లో సత్యరాజ్

కట్టప్ప గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సత్యరాజు… ఇప్పటికే చాలా సినిమాలలో కనిపించారు. బాహుబలి లాంటి సినిమాలో… అద్భుతమైన కట్టప్ప రోల్ చేసి… ఇప్పటికే ట్రెండింగ్ లో ఉన్నారు సత్యరాజ్. తెలుగులోనే కాకుండా ఇండస్ట్రీలో కూడా అద్భుతంగా రాణిస్తున్నారు సత్యరాజు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ లాగే… సత్యరాజు పోలికలు ఉంటాయి. ఆయన హైట్… కూడా సేమ్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో సత్యరాజ్ ను బయోపిక్ లో తీసుకోవాలని చర్చలు జరుగుతున్నాయట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు