Satyabhama : థర్డ్ సింగిల్ కూడా వచ్చింది.. కానీ రిలీజ్ డేట్ పైనే డౌట్..

Satyabhama : కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ జోష్ మీదుంది. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ఈ భామ రీ ఎంట్రీ తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది. రీసెంట్ గా భగవంత్ కేసరి తో సూపర్ హిట్ అందుకున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. కాజల్ మెయిన్ లీడ్ లో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న తాజా చిత్రం “సత్యభామ”. ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే కాజల్ ఇంప్రెస్స్ చేయగా, టీజర్ ద్వారా అంచనాలు పెంచేసింది. ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో కాజల్ సత్యభామ ఐపీఎస్ పాత్రలో నటిస్తుంది. ఇక ఈ సినిమా నుండి ప్రచార పనులు మొదలవగా, టీజర్ నుండే మంచి అంచనాలు పెంచేయగా, టీజర్ కట్స్ కూడా స్టైలిష్ గా ఉంది ఆకట్టుకోగా, స్క్రీన్ ప్లే శశి కిరణ్ టిక్కా అందిస్తుండడం వల్ల సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ కాగా, తాజాగా సత్యభామ నుండి మూడో సాంగ్ రిలీజ్ అయింది.

మూడో సింగల్ గా ‘వెతుకు వెతుకు’ సాంగ్..

టాలీవుడ్ ‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న “సత్యభామ” లో నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నాడు. “సత్యభామ” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు “సత్యభామ” సినిమా నుంచి థర్డ్ సింగిల్ ‘వెతుకు వెతుకు..’ రిలీజ్ చేశారు. ఇక ఈ పాటను శ్రీచరణ్ పాకాల కంపోజిషన్ లో ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పాడటం విశేషం. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. అమ్మాయిలపై జరుగుతున్న హత్యాయత్నాల నేపథ్యంలో..బాధిత యువతులను చూసి చలించిపోతుంది పోలీస్ ఆఫీసర్ సత్యభామ. ఆ నేరస్తులను పట్టుకోవడానికి సిద్ధమవుతుంది. ఆ సందర్భంలో వచ్చే పాట ఇది. ‘వెతుకు వెతుకు వెతుకు వెనకాడకుండ వెతుకు”… అంటూ ప్రేక్షకులను ఇన్ స్పైర్ చేసేలా సాగుతుంది ఈ పాట. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన టీజర్, లిరికల్ సాంగ్స్ తో “సత్యభామ” సినిమా మీద మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.

Satyabhama Movie Third Single Released

- Advertisement -

రిలీజ్ డేట్ పైనే డౌట్..

అయితే సత్యభామ సినిమా ఈ పాటికే రిలీజ్ కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల వాయిదా వేస్తూ వస్తున్నారు. ఫైనల్ గా మే 31న రిలీజ్ కి రెడీ అవుతుండగా, ఆ రోజు చాలా సినిమాలు పోటీగా రిలీజ్ అవుతున్నాయి. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి సహా అరడజనుకి పైగా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మరి అంత పోటీలో ఈ సినిమాని రిలీజ్ చేస్తారా లేదా మళ్ళీ వాయిదా వేస్తారా అనే సందేహాలు నెటిజన్లకు వస్తుంది. ఇక సత్యభామ సినిమాని సుమన్ చిక్కాల డైరెక్ట్ చేస్తుండగా, శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, రవి వర్మ, నాగినీడు, హర్ష వర్ధన్, నేహా పఠాన్, సంపద కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. మరి ఈ సినిమా రిలీజ్ నాటికి ఇంకెన్ని అంచనాలను పెంచుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు